మన తెలుగు భాషా సంస్కృతి , సంప్రదాయాలకు ప్రతీక ఉగాది పండుగ అని, ఉగాది పచ్చడిలో మానవ జీవన సారాంశము ఇమిడి ఉన్నదని అనంత సాగర్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు కోట జ్యోతి అన్నారు. శ్రీ విశ్వావసు నామ సంవత్సర ఉగాది పండుగ ను పురస్కరించుకుని మార్చ్ 28వ తేదీ శుక్రవారం రోజున నిర్వహించిన "ఉగాది బాల కవి సమ్మేళనం "కు అధ్యక్షత వహించారు.తెలుగు ఉపాధ్యాయులు కోణం పర్ష రాములు ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో పదహారు మంది విద్యార్థులు పాల్గొని తమ కవితలు వినిపించారు. ఉపాధ్యాయులు సమ్మయ్య ఉగాది పండుగ గురించి,నరేశ్ మాతృ భాష గొప్పదనము ,పండుగ ప్రాముఖ్యత గురించి, కవి దుర్గయ్య ఉగాది ఆగమనం గురించి విద్యార్థులకు వివరించారు.అనంతరం పాల్గొన్న బాల కవులు కవయిత్రులకు బహుమతులు అందచేశారు.ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు రామ స్వామి,శ్రీదేవి,సమ్మయ్య,కవిత,నరేశ్,దుర్గయ్య లు పాల్గొన్నారు.
అనంత సాగర్ ఉన్నత పాఠశాలలో ఉగాది బాల కవి సమ్మేళనం

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి