అమెరికాయ నమ:
అద్భుత దేశాయ నమ
ప్రపంచ కిరీటాయా నమ
ప్రసిద్ద దేశాయ నమ
నిన్ను ప్రస్తుతింప
నేనెంత నీ చెంత/
ఓ చిన్న చీమనే
దోమనే/పామునేమి కాదు కాటేయలేను
డాలర్లు కురిపించి
మా మనసు మురిపించి
ఎక్కడెక్కడినుండో
అక్కడకు రప్పించి
చుక్కలను చూపించి
పెక్కు రుచులను మరిపి,
బక్కచిక్కిన మమ్ము
బలవంతులుగా చేయగా
అక్కడే చిక్కుకొని
చిక్కినది తీసుకొని
పాప పుణ్యాలను
ధర్మాధర్మాలను
మా ఊరు పంపించి
పుణ్య కార్యాలను
పూజలు వ్రతములు
ఆనుదినముచేయుచు
అందరం ఆడుచు పాడుచు హాయి గా
ఉన్నాము అంత నీ దయ ఆమెరికా దేవా
అయిన వారికి దూరమైనాగాని
చూచుకొనుటకు ఉండే సొగసు సెల్లులలో
ఫోటోలు చూడొచ్చు మాటాడుకోవచ్చు
ఇంకేమి కావాలె
అయినవారికీ మాకు.
అందుకే అందుకో
మా ఆనంద స్తోత్రం
విందుకు వేళాయే
వినిపింతు తర్వాత.
జై ఐసు భూమి
Bye భాగ్యభూమి
సి వసుంధర.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి