స్వర్ణాంధ్ర స్వచ్ఛాంద్రతో పచ్చదనం పరిశుభ్రం.


 రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమం ద్వారా పచ్చదనంతో ఆహ్లాదాన్ని,  పరిశుభ్రతతో ఆరోగ్యాన్ని పొందవచ్చునని పాతపొన్నుటూరు సచివాలయం కార్యదర్శి జన్ని చంద్రమ్మ అన్నారు. గ్రామంలో జరిగిన స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమానికి ఆమె అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా చంద్రమ్మ మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ ఒక్కో సైనికుడిలా కృషి చేయాలని, విరివిగా మొక్కలు నాటాలని అన్నారు. స్థానిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు గుర్రాల కృష్ణారావు మాట్లాడుతూ స్వర్ణాంధ్ర సాధనలో ప్రతి పౌరుడూ భాగస్వామ్యం కావాలని, ప్రభుత్వం ఆశయాలను పాటిస్తూ ఒక సామాజిక బాధ్యతగా స్వచ్ఛతకోసం పాటుపడాలని అన్నారు. అనంతరం స్థానిక యువ నేత ఎద్దు సంతోష్ కుమార్ ర్యాలీని ప్రారంభించి, మానవహారం గావించారు. ఉపసర్పంచ్ గుజ్జ రామారావు అందరిచే స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర ప్రతిజ్ఞ గావించారు.  ఉపాధ్యాయులు అందవరపు రాజేష్ పలు నినాదాలతో ర్యాలీని హోరెత్తించారు. ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గిద్దాం కాలుష్య నియంత్రణ సాధిద్దాం వంటి అనేక నినాదాలు చోటు చేసుకున్నాయి. ఉపాధ్యాయులు కుదమ తిరుమలరావు స్వీయ గీతాలను ఆలపించి కార్యక్రమాన్ని రంజింపజేసారు. నేలతల్లి బీళ్ళు పగిలితే ప్రజా గుండె పగలదా, సకలరోగాలకు నీరే నివారణ అందుకే రానీయకు జల సంఘర్షణ అంటూ పలు అంశాలను తన కవితాగానంలో వినిపించి ఆలోచింపజేసారు. అనంతరం ఉపాధ్యాయులు పైసక్కి చంద్రశేఖరం, బొమ్మాళి నాగేశ్వరరావులు ప్రసంగించారు. మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పథకం ఫీల్డ్ అసిస్టెంట్ అల్లాడ శంకరరావు నేతృత్వంలో పలుచోట్ల మొక్కలు నాటించారు. ఈ కార్యక్రమంలో ఉద్యోగులు, గ్రామయువత, మహిళలు విద్యార్థులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

కామెంట్‌లు