వెనుకబడిన పిల్లల పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి: - -ఎఫ్ఎల్ఎన్ జిల్లా రిసోర్స్ పర్సన్ రవి

 తెలుగు, ఆంగ్లం, గణితాంశాల్లో వెనుకబడిన పిల్లల పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని ఎఫ్ఎల్ఎన్ జిల్లా రిసోర్స్ పర్సన్ ఎన్. రవి అన్నారు. సోమవారం కాల్వశ్రీరాంపూర్ మండలం ఊషన్నపల్లి ఆంగ్ల మాధ్యమ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలను ఆయన శ్రీరాంపూర్ కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయురాలు ఎన్. సునీతతో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన 1 నుంచి 5 తరగతుల పిల్లల ప్రతిభ అంశాలను పరీక్షించారు. పిల్లల చేత తెలుగు, ఆంగ్లం, పాఠ్యపుస్తకాలను చదివించారు. గణితంలో చతుర్విధ ప్రక్రియలు చేయించారు. అనంతరం పాఠశాలలో ఉపాధ్యాయులతో సమక్షా  సమావేశం నిర్వహించి, ఉపాధ్యాయులకు పలు సూచనలు చేశారు. చదువులో వెనుకబడిన పిల్లలకు ఉపాధ్యాయుడే దగ్గరుండి కనీస అభ్యసన సామర్ధ్యాలు సాధించేలా కృషి చేయాలని కోరారు. ఊషన్నపల్లి పాఠశాల పిల్లలు చక్కగా చదువుతున్నారని, ఇంకా 100 శాతం సామర్థ్యాలు సాధించేలా కృషి చేయాలని కోరారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఈర్ల సమ్మయ్య 3వ తరగతి తెలుగు ఆదర్శ పాఠ్య బోధన (మోడల్ లెసన్) చేశారు. అనంతరం శ్రీరాంపూర్ స్కూల్ కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయురాలు నరెడ్ల సునీత పాఠశాల రికార్డులు, రిజిస్టర్లు తనిఖీ చేశారు. పిల్లల సాధనా పుస్తకాలను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఈర్ల సమ్మయ్య, ఉపాధ్యాయులు అమృత సురేష్ కుమార్, శ్రీవాణి, పిల్లలు, పలువురు పాల్గొన్నారు.
కామెంట్‌లు