.రంజాన్ పర్వదినం.దానధర్మాలకు ఉత్తమ దినం:- డా.చీదెళ్ళ సీతాలక్ష్మి-హస్తినాపురం,హైదరాబాద్
ప్రేమ కరుణ దయ జాలి కలిగి
మానవ సంస్కృతి విలసిల్లి సంప్రదాయానికి నెలవై
నెలవంకకు చేరువై
మానసిక పరివర్తనకు ఆలవాలమై
ప్రత్యేకతను చాటుతూ
ఉపవాస దీక్షతో
ఖురాన్ ను చదువుతూ
సమైక్య రాగాన్ని పలుకుతూ
దానధర్మాలను చేస్తూ
పవిత్రంగా సాగే
చాంద్రమాన తొమ్మిదవ మాసం
శారీరక మానసిక ధైర్యాన్ని పెంచుతూ
ఉన్నదాంట్లోనే ఇతరులకు పంచాలనే నీతిబోధ చేస్తూ
బీద గొప్ప భేదం లేక
కలసిమెలసి చేసుకోవాలన్న
సందేశంతో సాగే పండుగ
తీపిని పంచే పర్వదినం
రండి కలిసుందాం
మానవత్వాన్ని చాటుదాం
అంటూ తెలిపే రంజాన్ 
ముస్లిం సోదరుల 
సహృదయ
సుహృద్భావత్వానికి
పరాకాష్ట!!

క్రమశిక్షణ దాతృత్వం
ధార్మికట ముప్పేట
ముడివేసి సాగుతూ
పవిత్ర ఖురాన్ పుట్టిన రోజు
పగలు ఉపవాస దీక్ష
చంద్రోదయం నుండి రాత్రిళ్ళు
ఒక పూట భోజనం 
ఒక నియమంతో కట్టుబడి
సాగుతున్న పవిత్రమాసం
పాపాలను దూరం చేస్తూ
పుణ్యాలను దరి చేరుతూ
పంచ వేళలో నమాజ్ చేస్తూ
అసత్యానికి దూరం వుంటూ
అల్లా హి మాలిక్ అంటూ
పవిత్ర మనసుతో ఆరాధించే
పవిత్ర మాసం
ముస్లిం సంస్కృతికి ప్రతిబింబం!!
-----------------

కామెంట్‌లు