జయంమనదే...! గట్టిగా అనుకో.....! ;- కోరాడ నరసింహా రావు.
 గట్టిగా అనుకుంటే.... 
 జయం మనదే ఐ పోతుం దా....! ? 
 ఎందుకు కాదు..!! 
  గట్టిగా అనుకోవట మంటే 
బిగ్గర గా అరిచేయటం కాదు సోదరా....! 

నే నె లాగైనా ఇది సాధిం చాలి అనే విషయాన్ని ధృడంగా మనసులో  నిశ్చ యించు కోవటం!

సంకల్పం ధృడ మైన దైతే 
నీలో పట్టుదల పెరుగు తుంది...! 
  పట్టుదల పెరిగితే ప్రయత్నములో ఖచ్చితత్వ మొస్తుంది...! 

నిర్దుష్టమైన ప్రయత్నానికి నిశ్చయమైన ఫలితము లభి స్తుంది... ఇది తధ్యం...!! 
 
పరాజయం పాలై నపుడు 
 నిరుత్సాహంతో నీరు గారి పోరాదు.., 
 పట్టుదల రెట్టింపుకావాలి! 

ప్రత్యర్ధి గెలుపుకు నీలో కలుగ వలసినది ఈర్ష్యా సూయలు కాదు... 
  ఆ ప్రతిభకు హృదయాభి నందన...! 

నువ్వెప్పు డైనా పాడుతా తీయగా చూసావా...! 
   ఎంత అద్భుతముగా పా డుతున్నారు..! 
 ఆ డాన్స్పోటీలుచూసావా
 ఎంతెంత ప్రతిభ చూపు తున్నారు..! 

కృ షి , దీ క్ష, పట్టుదల... 
 నిరంతర సాధన...! 
  ఉంటే.... 
 సాధించ లేనిది యేదీ ఉండదు సోదరా....! 

 జీవితంలో ఏదైనా సాధించాలి అని గట్టిగా అనుకో... 
   నీ ప్రయత్నములో లోపం  లేకుండా చూసుకో... 
  అప్పుడు నీవు ఓడిపోయినా,విజయుడవే
 అసలు ప్రయత్నమే చేయని వాడి కన్నా.... 
 నీవే  గొప్పవానివి!! 

కృ షి తో నాస్తి దుర్భిక్షమ్
   శ్రమయేవ జయతే
 జయం మనదే....! 
     ******

కామెంట్‌లు