సుధీర:- :పద్మ త్రిపురారి
 పల్లవి::
మనసూ మమత కుసుమలత
విరి‌సిన బంధపు ప్రేమలత 
జీవన యానపు ధీరసుత 
ప్రతిభా నిపుణత తన ఘనత
       "మనసు"
చరణం::
ప్రేమా స్నేహమె ఆభరణం 
ఓర్పు సహనమె తన సుగుణం 
కోమల హృదయమె తనకు ధనం
నేర్పరి తనమే తనకు వరం.
     "మనసు"
చరణం::
ఆది శక్తికే ప్రియ చెలిగా
అంతము చేయును దుర్మదము 
అంతరంగమే నిర్భయమై 
నింగికి వేసెను నిచ్చెనలు.
     "మనసు"
చరణం::
రుద్రమ ఝాన్సీ వారసులై 
ధైర్యపు శౌర్యపు మనసిజలై 
భీకర సమరపు సైనికులై 
ఘర్జన చేసిరి సుధీరలుగా.
    "మనసు"
చరణం::
అడుగుఅడుగులో కదిలెడి సుడులను 
తడయక దడయక దారులు వెతుకుతు 
విజయ తీరమును చేరెడి 
మహిళలు 
ధరణికి వెలుగులు 
అవనికి సొబగులు.
     "మనసు"

కామెంట్‌లు