విశాఖపట్నం ముడసర్లోవ పార్క్ లో అత్యంత వైభవంగా అందమైన కుటుంబం ఆత్మీయ సమ్మేళనం జరిగింది. ఆ వేదికపై తెలుగు పద్యాలను, భగవద్గీత శ్లోకాలను చిన్నారులు వల్లెవేసారు. తెలుగు భాషను ఎంతో స్పష్టంగా చెబుతుంటే, హాజరైన మూడు వందలకు పైబడిన కుటుంబ సభ్యులు వీనులవిందుగా ఉందంటూ మిక్కిలి ఆస్వాదించారు. పార్వతీపురం మన్యం జిల్లా, కుదమ గ్రామస్తులు కుదమ గంగన్న బాబయ్య పట్నాయక్, సూర్యనారాయణ పట్నాయక్ లనే ఇద్దరు అన్నదమ్ములు ఏభై ఏళ్ళ క్రితం స్వర్గస్తులైరి. వారి సంతానం, వారి తర్వాత తరాలు అలా అలా ఎనభైకి పైగా కుటుంబాలు పలు ప్రాంతాల్లో స్థిరపడగా, వారందరూ ఒక్క చోట చేరుకొని రోజంతా కష్టసుఖాలను ముచ్చటిస్తూ హాయిగా గడిపారు. ఈనాటి వేదికపై విద్యావంతులు అరసాడ వాసుదేవరావు మనుమడు బలివాడ లిఖిత్ నారాయణ్, విద్యావంతులు కుదమ కృష్ణారావు మనవడు చరణ్ పట్నాయక్, తదితర పిల్లలు ముద్దుముద్దుగా పలుకులు పలికి, తెలుగుదనాన్ని పండించి అబ్బురపరిచారు. ఈ బుజ్జి పిల్లలందరికీ కుదమ పరమేశ్వరరావు, కె.గోపి, అరసాడ రఘుపతిరావు, కె.శ్రీనివాసరావు, కె.వి.చలపతిరావు, కె.సత్యసాయిబాబా, నడుకూరు విజయకుమార్, కె.మధుభాను కుమార్ పట్నాయక్, రఘుపాతృని వెంకటేశ్వర పట్నాయక్, ఎ.వాసుదేవరావు, కుదమ తిరుమలరావు తదితరులు తెలుగు ప్రహేలిక నిర్వహించి, బహుమతి ప్రదానం గావించారు. కుటుంబ బాంధవ్యాల పవిత్రతను, తెలుగు తియ్యందనాన్ని పెంచేదిశగా అందమైన కుటుంబం ఆత్మీయ సమ్మేళనం అందరికీ ఆదర్శంగా నిలుస్తోందని పలువురు ప్రముఖులు వ్యాఖ్యానిస్తూ, అభినందించారు. ఈ కార్యక్రమంలో పక్కి మధుసూదనరావు, జగదీశ్వర రావు, సబినీష్ కురుపాం గోవిందరావు, పాల్తేరు మాధవరావు, సాలూరు రామకృష్ణ, తట్టికోట గణపతిరావు, తుంబలి యజ్ఞేశ్వరరావు, బగ్గాం ధనంజయరావు తదితరులు పాల్గొని చిన్నారులను ఆశీర్వదించారు.
పద్యాలు, శ్లోకాలతో తెలుగు వెలుగులు పంచిన బాలలు

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి