నేనొక విశ్వమానవ మానవత్వాన్ని
ప్రేమను పంచే ప్రజ్వల దీపాన్ని !
క్షుద్బాధ నెరిగిన-
కరకుతాంబూలాన్ని !
మిన్ను విరిగి పడ్డా-
భరించగల బలశాలిని !
లోకాన్ని ఏలకున్నా-
లోకులకు హితమైనవాడిని!
దేశచరిత్ర చదివినవాడిని-
బ్రిటీశు పాలనలో బ్రతికినవాడిని!
స్వతంత్ర భారత రాజ్యంగంలో
బడుగులకు ,
అంబేద్కర్ అందించిన -
ఫలాలనుచవిచూసినోడిని!
ప్రభుత్వ పాలనలో -
బడుగులకు ప్రాతినిద్యం కల్పించి
మానవ మనుగుడకు -
మానవత్వం అందించిన,
మహనీయుడు - బాబాసాహెబ్ అంబేడ్కర్ !
సిత ప్రజ్ఞాశాలి -బడుగులపాలిట దేవుడాయన!!
***
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి