పెయింటింగ్ పోటీలో ఓడిఎఫ్ విద్యార్థుల ప్రతిభ

 జాతీయ భద్రతా దినోత్సవం సందర్భంగా జాతీయ భద్రతా మండలి తెలంగాణ విభాగం, రాష్ట్ర కార్మిక మంత్రిత్వ శాఖ సంయుక్తంగా భద్రత, ఆరోగ్యం , పర్యావరణం అనే అంశంపై పాఠశాల విద్యార్థులకు నిర్వహించిన పెయింటింగ్ పోటీలో కంది మండలం ఆయుధ కర్మాగారం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల 9వ తరగతి విద్యార్థిని ఎస్ సృజన, ఎనిమిదో తరగతి విద్యార్థి డి మనోహర్ సీనియర్ విభాగంలో ప్రధమ తృతీయ బహుమతులు పొందినట్లు గైడు ఉపాధ్యాయుడు అడ్డాడ శ్రీనివాసరావు తెలిపారు. వీరికి మంగళవారం  హైదరాబాదు రవీంద్ర భారతిలో నిర్వహించిన కార్యక్రమంలో ప్రముఖుల చేతుల మీదుగా బహుమతులు, ప్రశంసా పత్రాలు అందజేశారు. కాగా బుధవారం పాఠశాలలో నిర్వహించిన సమావేశంలో ప్రధానోపాధ్యాయురాలు జయంతి వాణి, ఉపాధ్యాయులు విజయభాస్కర్, రవీందర్, కనకదుర్గ,చవాన్ సుభాన్ సింగ్, సంధ్య విద్యార్థుల్ని అభినందించారు. అయితే ఈ పోటీలో ఒక్క ఓడిఎఫ్ జడ్పీ పాఠశాల నుండే 50 మంది విద్యార్థులు పాల్గొనడం విశేషం.
కామెంట్‌లు