పెద్దకడబూర్ మండల పరిధిలోని,జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, కంబదహాళ్ లో గణితోపాధ్యాయుడు పని చేస్తున్న ప్రముఖ బాలసాహిత్యవేత్త ,బాలబంధు గద్వాల సోమన్న 65వ పుస్తకం "ద్రాక్ష తీగలు" పుస్తకావిష్కరణ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల,చిన్నటేకూరు యస్.యస్.సి-2010--11 బ్యాచ్,పూర్వ ఉపాధ్యాయులు మరియు విద్యార్థుల ఆత్మీయ కలయిక సందర్భంగా విచ్చేసిన వారితో పాటు గతంలో పని చేసిన విశ్రాంత ప్రధానోపాధ్యాయురాలు శ్రీమతి అన్నపూర్ణ దేవి,విశ్రాంత ప్రధానోపాధ్యాయురాలు శ్రీమతి జయమ్మ ,శ్రీమతి వసంత,శ్రీ కె.డి.జె.బాబు,కళాకారులు, భాషాపాధ్యాయులు శ్రీ డి.కేశవయ్య,శ్రీమతి అనిత మరియు అతిరథ మహారథుల చేతుల మీద ఘనంగా ఆవిష్కరించారు.పిదప ఈ పుస్తకాన్ని విశ్రాంత పై పర్యవేక్షణ అధికారి శ్రీ పోకూరి చంద్రశేఖర్ గారికి అంకితమిచ్చారు.అనంతరం జాతీయ,అంతర్జాతీయ స్థాయిలో ఎన్నో అవార్డులు, రివార్డులు అందుకున్న,అచిర కాల వ్యవధిలో 65 పుస్తకాలు రచించి,పలు చోట్ల వాటిని ఆవిష్కరించిన గద్వాల సోమన్న అవిరళ కృషిని గుర్తించి పూర్వ విద్యార్థులు మరియు ఉపాధ్యాయులు సత్కరించారు.ఈ కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు రామాంజనేయులు, రాఘవేంద్ర,శుభాన్,ఊశేని,కిరణ్,లాల్ బాషా,ఝాన్సీ లక్ష్మీ, సరిత, సంధ్యారాణి,ఆనంతలక్ష్మి,హరిత మరియు రేణుక మున్నగు వారు పాల్గొన్నారు. కృతికర్త గద్వాల సోమన్న ను తోటి ఉపాధ్యాయులు, శ్రేయోభిలాషులు అభినందించారు.
చిన్నటేకూరు పాఠశాలలో కవి సోమన్న "ద్రాక్ష తీగలు" పుస్తకావిష్కరణ

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి