పుట్టపర్తి లోని ప్రశాంతి నిలయానికి దక్షిణ భాగాన విద్యాగిరి కొండపై తపోవనం ఉన్నది. నీ వనములో ఘనసార, సురదారు, మందార, చంపక, చందన, పచ్చ కర్పూరం చెట్లు, దేవదారు, సంపెంగ, మై సాక్షి, మంచి గంధపు చెట్లు, మారేడు, రుద్రాక్ష, మామిడి, వేప , రావి, జువ్వి వంటి అనేక వృక్షములు ఉన్నాయి.
ఇక్కడ 1-7-1957 న శ్రీ సత్య సాయి బాబా వారు స్వయంగా ఒక మర్రిచెట్టు (వటవృక్షం) నాటి దానికి ధ్యాన వృక్షమని పేరిడినారు. అంతేకాక బీజాక్షరాలు కలిగిన ఒక రాగి యంత్రమును సృష్టించి బాబాగారు ఈ చెట్టు మొదట్లో పాది పెట్టినారు. అందువల్ల మున్ముందు కాలంలో స్వామివారి అవతార సమాప్తం తర్వాత ఇచ్చట తపస్సు చేసిన వారి కోరికలు నెరవేరుతాయని వరం ప్రసాదించినట్లు పుట్టపర్తి స్థల పురాణంలో 41,42 పేజీలలో తెలుపబడినాయి. అందుకే ఈ వృక్షాన్ని ధ్యానవృక్షం అంటారు. ఎక్కడికి వెళ్లాలంటే పుట్టపర్తి ముఖ్య రహదారి నుంచి జనరల్ హాస్పిటల్ పక్కగా శ్రీనివాస గెస్ట్ హౌస్ వెనుక రోడ్డు ద్వారా కార్లు ఆటోలు వెళతాయి. గణేష్ గుడి వెనకనున్న మెట్ల దారిపై కూడా అక్కడికి వెళ్ళవచ్చును.
ధ్యాన వృక్షము:- తాటి కోల పద్మావతి.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి