రాజు 10వ తరగతి చదువుతున్నాడు. చిన్నప్పటి నుంచీ క్లాస్ ఫస్ట్. సంవత్సంరం అంతా బడికి వచ్చేవాడు. 1వ తరగతి నుండి ఇప్పటి వరకు పాఠశాలకు రాని సందర్భాలు వేళ్ళ మీద లెక్కించవచ్చు.
ప్రతిరోజూ తీరిక సమయాలలో ఆటలు బాగా ఆడి, ఆ తర్వాత ఇంటికి వెళ్ళి చదువుకునే వాడు. రాజుతో పాటు సురేంద్ర, జయంత ఇంకా కొంత మంది తెలివైన విద్యార్థులు ఉండేవారు. కానీ వాళ్ళు రాజు అంత తెలివైన వారు కాదు. చిన్నప్పటి నుంచి అప్పుడప్పుడు అనారోగ్యం పేరుతో పాఠశాలకు రాలేక పోతున్నారు.
ఒకరోజు శ్రుతి అనే అమ్మాయి రాజును అడిగింది. "రాజూ! ఈ పది సంవత్సరాలలో నువ్వు పాఠశాలకు రాని సందర్భాలు వేళ్ళ మీద లెక్కించవచ్చు. ఎప్పుడూ ఆరోగ్యంగా ఉంటావు. ఏమిటీ రహస్యం." అని. అప్పుడు రాజు "చిన్నప్పటి నుంచీ అన్ని రకాల కూరగాయలను తినేవాడిని. మా అమ్మా నాన్నలు ఇచ్చిన పాకెట్ మనీతో అనేక రకాల పండ్లు కొనుక్కుని క్రమం తప్పకుండా తింటాను. దుకాణాలలో దొరికే అడ్డమైన చిరుతిళ్లకు నేను చాలా దూరం. కూల్ డ్రింక్స్ నాకు విషంతో సమానం. నీకూ అమ్మా నాన్నలు పాకెట్ మనీ ఇస్తారు కదా! నువ్వూ ఆరోగ్యాన్ని ఇచ్చే ఆహారానికి వాటిని ఖర్చు పెట్టవచ్చు. రోజూ ఒక గంట సేపు, సెలవు రోజుల్లో సాయంత్రం మొత్తం రకరకాల ఆటలు ఆడతాను. ఇదీ రహస్యం." అన్నాడు.
"నువ్వు చాలా గ్రేట్ రాజు!." అన్నది శ్రుతి.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి