వాకిలి తడిలేక -
ఎండి కేకలేస్తుంది!
పెరటిలోని చెట్లు అల్లల్లాడి
ఆకులురాల్చుతున్నాయి!
వంటింటిలోని పాత్రలు
వెలితై వేదనపడుతున్నాయి!
నీళ్ళతో నిండిననయనాలు-
చిత్రంగాచూస్తున్నాయి!
కానీ ....కళ్ళకు
ఏమి కనిపించుట లేదు
రాలుస్తున్నాయి బాధాతప్త భాష్పాలు!
దీపంలో చమురు అయిపోయిందేమో
గాలికిరెప రెపలాడుతూ-
కునికి ఆరిపోయింది!
ఇంటిలోని వెలుగును -
చీకటి అలుము కుంది!!
***
చెదిరిన దీపం:: --కుసుమ వెంకటరత్నం- హన్మకొండ.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి