తల్లితండ్రులే స్నేహితులైతే: - సుమ కైకాల
 ఆ రోజు పేరెంట్స్ ,  టీచర్స్ మీటింగ్ జరుగుతుంది. అందుకు ముఖ్య అతిథిగా మోటివేషనల్ స్పీకర్ విహారి వస్తాడు.
విహారి : సాయంత్రం ఇంటికి వచ్చాక మీ పిల్లలతో ఎంతసేపు గడుపుతారు?
సురేష్: నాకు ఇంటికి వచ్చేసరికి ఆలస్యమవుతుంది. అప్పటికే బాబు నిద్రపోతాడు.
రమేష్: నేను ఇంటికి వచ్చాక అందరం కలిసి టీవీ చూస్తాం.
రాధ: నాకు ఆఫీసు నుండి రావడం ఆలస్యమవుతుంది. ట్యూషన్ టీచర్ ను పెట్టుకున్నాం.
రమ: నాకు ఇంటికి వచ్చాక కూడా మీటింగ్స్ ఉంటాయి. పనిమనిషి బాబుని చూస్తుంది.
విహారి: నిద్రపోయే సమయంలో కథలు ఎంత మంది చెప్తారు?
సురేష్: అది నా వంతు కాదు.
రమేష్: అంత సమయం నాకు లేదు.
రాధ: పని చేసేసరికే అలసట వస్తుంది. ఎపుడైనా చెప్తాను.
రమ: కాసేపు ట్యాబ్ చూసి నిద్రపోతాడు. నేను కథలు చెప్పను.
విహారి: మీరు ప్రేమగా వారితో పది నిముషాలు కూడా గడపడం లేదు. అవునా?
సురేష్: నా సంపాదన బాబు కోసమే!
రమేష్: టీవీ చూసేటప్పుడు కలిసే ఉంటాము.
రాధ: నేను కష్టపడేది బాబు కోసమే!
రమ: ట్యాబ్ లో మంచి కథలు పెట్టిస్తాను.
విహారి: పిల్లలు పెద్దవాళ్ళు చెప్పింది నేర్చుకోరు. వాళ్ళను చూసి అనుకరిస్తారు. మీకున్న సమయాన్ని పిల్లలతో గడపండి. పాఠశాలకు దింపండి. వారు చేసే మంచిపనులు గుర్తించండి. అభినoదించండి. వారికి మంచి స్నేహితులుగా మారండి. మంచి స్నేహితులుగా మారిన మీ పిల్లలు పెద్దయ్యాక కూడా మిమ్మల్ని మరచిపోరు.
***********

కామెంట్‌లు