అద్భుతమైన రంగులతో
అలరించే తూరుపు
అంతరంగాన్ని శాంతితో
ఆద మరపించు మార్పులా..
చేయితిరిగిన చిత్రకారుని
చేతిలోని కుంచె కదలికలకు
చక్కగా భావమోప్పిన
చమత్కారమైన చిత్రంలా!
ఆస్వాదించు హృదయానికి
అందిన ఆనందపు అనుభూతిని
అపురూపంగా దాచుకుని
అనుదినమూ అనుభవించేలా!
మదిని జనించు భావాలను
పదిలంగా పట్టుకుని
వినువీధిని ఊరేగింప
మేనాగా మారెను మేఘమాలే!
అలలా కదిలే ఆనందాలు
కలలా తోచే అందాలు
ఇలలో దినమూ సంభవించే
ఇంపైన అరుణోదయాలే!
అఖిల జగతికి ప్రగతిని తెచ్చే
ఆదిత్యుని దివ్య ఆగమనానికి
అంజలి ఘటించు అవకాశం
అందించిన మరొక ఉదయానికి
🌸🌸 సుప్రభాతం🌸🌸
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి