అరుణోదయం సాహితీ వేదిక , అనుబంధ సంస్థలు అరుణాక్షరకవితా తోరణాలు, అరుణరాగాలు, కవితాసాగరం వేదికలు కలిసి విశ్వావసునామసoవత్సర ఉగాది పండుగ సందర్బంగా కవులు,రచయితలు,గాయని గాయకులు, సాహిత్యవేత్తలు కలిసి శుక్రవారం జరుపుకున్న ఆత్మీయ సమ్మేళనం ఘనంగా నిర్వహించి, పాటలు, కవితలు , ప్రసంగాలతో ఆనందంగా గడిపారు.
దాదాపు రెండున్నర గంటల పాటు జరిగిన ఈ కార్యక్రమంలో సమూహాల అధ్యక్షురాలు డా. అరుణకోదాటి, పర్యవేక్షకులు డా. రామకృష్ణచంద్రమౌళి గారు, ఆచార్య T. గౌరీశంకర్ గారు, తెలంగాణా సాహిత్య అకాడమీ సెక్రటరీ N. బాలాచారిగారు, కృష్ణారెడ్డి గారు, ప్రముఖ సాహిత్యవేత్త ఘంటా మనోహర్ రెడ్డి గారు,సాహిత్యవేత్త దాస్యం సేనాదిపతిగారు తమ తమ సాహితోపన్యాసాలతో సభను రoజింప చేసారు.
సమూహాల సమన్వయ కర్త గుండ్లంపల్లి రాజేంద్ర ప్రసాద్ గారు సభను చక్కగా నిర్వహించారు.
బిట్టవరం శ్రీమన్నారాయణ గారు సాంకేతిక సహకారం అందించారు.
సమూహాల అడ్మిన్ అంబాభవాని గారు , అనేకమంది కవులు/ కవయిత్రులు, గాయని గాయకులు పాల్గొని పాత సంవత్సరం అయిన క్రోధి నామ సంవత్సరానికి వీడ్కోలు చెప్పుతూ, నూతన సంవత్సరం అయిన శ్రీ విశ్వావసు నామ సంవత్సరానికి స్వాగతం పలుకుతూ సంతోషంగా ఉగాది పండుగ రెండురోజుల ముందే సందడిచేస్తూ జరుపుకున్నారు.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి