సుప్రభాత కవిత : - బృంద
ఎదురుచూచు కన్నుల కల 
ఎరుగుటయే  కాదు 
ఎంచక్కగా దానిని నిజం చేస్తూ
ఏతెంచు వేలుపు పిలుపు వినలేదా?

ఆకు చాటుగా వేచి ఉన్న 
అరవిందపు ఆత్రములన్నీ 
అర్థమయిన అంతర్యామి 
అనుగ్రహపు ఆనవాలు కనలేదా?

అంతరిక్షాన అలుపు లేక 
సంచరించు సమవర్తికి 
అవని అణువణువూ 
అవగతమని అర్థం అవలేదా?

సడిచేయని అద్భుతమేదో 
ముడిపడిన పెక్కు చిక్కులు 
విడదీసి వేదన తొలగించి 
తడి కనులను తుడిచేనని తెలియదా?

ఆశించి అందుకోలేని 
అపురూపమైన విజయమేదో 
అరచేతిలో ఉంచి పండుగ తెచ్చే 
అరుణోదయపు సవ్వడి వినలేదా?

కలలు కన్న కనులకు 
ఎదురుచూచు ఎడదకు
కలవరించు తలపులక
కానుకలు తెచ్చే కమ్మని వేకువకు

🌸🌸సుప్రభాతం🌸🌸


కామెంట్‌లు