బ్రతుకే ...భారమైన వారలకు విజయాలా...!
అసలు విజయమంటే...
గొప్ప గొప్ప విషయాలలో పోటీ పడటం... బహుమాతులు గెలవటం...
ఇవేనా విజయా లంటే...
ఎదురైన సమస్యలతో పోరాడి.. నిలద్రొక్కుకు బ్రతక గలగటమే గొప్పను కుంటే...,
ఇంక బాహా - బాహీ లు
విజయాలున్నా...!!
ఎన్ని జన్మల పాప కర్మ ల ఫలమో... నా ఈ జన్మము!
జన్మ మెత్తినాక ఎవరికైనా అనుభవించకతప్పదుకదాకర్మ ఫలం..!
ఎంత కిది కర్మ ఫలమే ఐనా... మరీ ఇంత
దారుణమా...!?
దారుణమే, కాక మరేమి ఇది...?!
ఇది నిక్కచ్చిగ శాపగ్రస్థ జీవితమే...!
జీ విత మన్నాక ... కడివెడు కష్టాలున్నా... చిటికెడైనా సుఖాలు ఉండాలిగా...!
ఉండాలి...నిజమే!
ఉండాలి అంటె... పెట్టి పుట్టాలిగా..!
పుట్టటమే చెడు నక్షత్రంలో పుట్టి, ఉన్న బంగారము, డబ్బు అన్నీ పోగొట్టిన నష్ట జాతకుడనట... అమ్మ అనేది...!!
అనటమేమిటి...,
ఊహా తెలిసిన నాటినుం డీ.. ఎన్నిరోగాలు... ?!
ఎన్నో రోగాలు... కాలుకు తగ్గితే కన్నుకి...
కన్నుకు తగ్గితే, చెవికి...
చెవికి తగ్గితే తలకి...
ఎప్పుడూ ఏదో ఒక బాధ!
బాధలంటే ఒక్క శారీరక బాధలలేనా...
ఆర్ధిక బాధలో...
కడుపు నిండా కూటికీ...
ఒంటి నిండా గుడ్డకి....
తలదాచుకునే గూటికి
అన్నిటికీ ఇబ్బందు లే !
ఇబ్బందు లంటే ఇబ్బందులా....!
అలాటివి పగవారికి కూడా రాకూడదు..!!
రాకూడనివి వస్తేనే కదా అవి కష్టా లను కోవటం !
అన్ని కష్టాలలోనూ... అప్పుడప్పుడూ,అక్కడక్క డ... ఎడారిలో ఒయాసిస్సులా...
అనుకోని అదృష్టపుఆనందం...!
యే జన్మ లోనో యే కాస్తో పరమేశ్వరారాధన చేసు న్నానేమో ...
అబ్బటమేమిటి...కాలం చేసినగాయాలకు...ఆకాలమె వాటికి లేపనంగా ఇచ్చిందేమో..!!
ఈ జీవితంలో అసలు విజయాలు అని చెప్పు కో టానికేమీ లేక పోయినా...
పడిలేస్తూ...లేచి పడుతూ
నిలద్రొక్కుకుని,ఇలానడవ గలగటమే గొప్ప విజయం ఊ హించుకుని ఆనందిం చటమే గొప్ప విజయం..!!
******:
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి