మత మదేదియైన మంచి కొరకే బుట్టె
పరమార్ధమును వీడి చరియించు కొందరు
మతములకు నపకీర్తి కలిగించు చుండగా
మతములు దీనముగ విలపించు చుండెను...!
శైవము - వైష్ణవము
బౌధ్దము - హైందవము
హైందవము - ఇస్లాము
క్రైస్తవము-హైందవము
ఆధిపత్యమునకై...
రక్త పాతములు...!
మానవత్వము కన్న
గొప్పమత మేముంది
మనిషితనమునువిడచి
మృగములుగమార్చునది
మత మదేది యైన...
మంట గలప వలెను!
మత పరమార్ధము
స్నేహ,సుహృద్భావము
దయ గల హృదయమే
దైవ మందిరము
ప్రేమ,సేవ,త్యాగములే
ప్రార్ధనలు పూజలు !!
ఎవరి మతము వారి
అభిమతముగా....
పరమతద్వేషమును
ప్రతి ఒక్కరూ వీడి...
అన్నదమ్ముల వలే
ఐక మత్య ముగా
అందరూ హా యి గా
కలిసి బ్రతకాలి...!
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి