కవి తలపులు:- గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
ఊహలు 
ఊరించనా
విషయాలు 
ఎరిగించనా

అక్షరాలు 
అల్లనా 
పదాలు 
పేర్చనా 

కవిత్వము 
రాయనా
గీతము 
ఆలపించనా

కళ్ళను 
కట్టేయనా
మదులను 
దొచేయనా

జోలపాట 
పాడనా 
డొలపట్టి 
ఊపనా 

మాటలు 
వదలనా
తేనెబొట్లు 
చిందనా

ముచ్చట్లు 
చెప్పనా
చప్పట్లు 
కొట్టించనా

ముద్దులు 
పెట్టనా
మురిపెము 
చేయనా

వెన్నెల 
వెదజల్లనా
హాయిగ 
విహరింపజేయనా

మల్లెలు 
చల్లనా
మత్తునందు 
దించనా

గళము 
విప్పనా
స్వరాలు 
కురిపించనా

నిద్దుర 
పుచ్చనా
మేలుకొలుపు 
పాడనా

పాఠకులను
మెప్పించనా
పొగడ్తలను
స్వీకరించనా

కవిరాజునని
చాటనా
కవనజగతిని
ఏలనా


కామెంట్‌లు