కామదహనం:- డా.చీదెళ్ళ సీతాలక్ష్మి-విశ్రాంత సహాయాచార్యులు-హైదరాబాద్
మదనుడు వదిలిన 
సుమబాణానికి వివశుడై
గుండె ఉప్పొంగి
శివుని మనసులో ప్రేమ పొంగి
పార్వతికే లొంగ
చంచలమైన మనసుకు కారణమైన కామునిపై
కోపోద్రిక్తుడై
తెరిచే త్రినేత్రం
కాల్చేసే కాముని
రతీదేవి ఏడిచెను
హరుడు కనికరించెను 
అందరి మనసులో కాముడు నిలిచెను!!

ప్రహ్లాదుని చంప యత్నించి
ప్రేమను గుమ్మరించి ఒడిలో కూచోబెట్టుకునే మేనత్త హోళికా
ఆ మంటల్లో తానే దహియించుకు పోయే
నవ్వు రాజిల్లగా మంటల నుండి వచ్చేసే దరహాసంతో ప్రహ్లాదుడు
హోళికా దహనం
భక్తజనులకు ఆనందం!!

రంగురంగుల పండుగ
అందరి మది నిండుగా
ఆనందాలే మెండుగా
లేదుగా చిన్న పెద్ద తేడా !!

ఒకరిపై ఒకరు చల్లుకొనిరి రంగులు
సప్తవర్ణ శోభితమై
ఊరేగుతూ
ఉప్పొంగే ఉత్సాహంతో
చేసుకొనిరి 
సంబురాలు సంతోషంతో
కాముకత్వం కాలాలి
ప్రేమలు ఉప్పొంగాలి
ఇదే కదా కామదహనం నీతి!!

హొలీ పండుగ
ఫాల్గుణ పౌర్ణమి
కాముని పున్నమి
వంసంతోత్సవం
మోదుగుపూలను ఉడికించి
చేసిన రంగు పోసిన 
బట్ట చినిగినంత వరకు వుండు
బ్రతుకున్నంతవరకు రంగులమయం 
జీవితాంతం ఆనందమయం
ఇదే రంగులపండుగ సంకేతం!!

కామ దహనం అంటే
కోరికలను కాల్చేయడం
పాత ఆలోచనలకు పాతరేయడం
ధర్మ బద్ధమైన జీవనానికి నాంది పలకడం!!

విశ్వమంతా సప్తవర్ణ మిళితం
సంతోష సంబరాలలో తెలియాడుతూ
రంగులమయజీవితాన్ని ఆహ్వానించే పవిత్ర దినం
అందరికీ ఆమోదం ఆనందం
కలిసివుండుటలో కలదు సుఖం
మిఠాయి పేరులతో సంబరాల హోరు
ఆనందాల జోరు
పండువెన్నెల కెరటాల తీరు
సకల ప్రాణికోటికి ఆరోగ్యాల తేరు
వసంతాగమనానికి పలుకుదాం ఆహ్వానం!!

అతి సర్వత్రా వర్జయేత్...
------------------------


కామెంట్‌లు