మర్రి"అత్తి"కుటుంబానికి చెందిన చెట్టు. భారతదేశంలో ఈ జాతి చెట్లని పవిత్రమైనముగా ఎంచబడుతున్నాయి. వీటిలో పిప్పల వృక్షము అంటే రావి సువిఖ్యాతమైంది. అలహాబాద్ లో"త్రివేణి సంగమం'దగ్గరున్న"అక్షయవటము"(అంటే నశించని మర్రి) ఉన్నది. దీని చుట్టూ ఎన్నో గాథలు అల్లుకొని ఉన్నాయి. ఇప్పటికీ లక్షలాది యాత్రికులు వెళ్లి దానిని దర్శిస్తుంటారు.
నరసింహ వృక్షం:
చెట్టు ఆకృతిని బట్టి ఆ వృక్షాన్నికా పేరు వచ్చింది. మహా పుణ్యక్షేత్రంగా ప్రసిద్ధిగాంచిన అహోబిలంలో కొండపైన ఒక మర్రి చెట్టు ఉంది. ఈ వృక్ష విశేషము ఏమిటంటే దీనికి గల పెద్ద రంధ్రం (తొర్ర) అచ్చు నోరు తెరిచిన నృసింహస్వామి ఆకృతిని పోలి ఉంది. పైన కిరీటం ధరించిన శ్రీ ఉగ్ర నరసింహుని లాగా ఈ వృక్షం ప్రకృతి పరంగా ఈ ఆకృతిగా తయారైవుంది. ఇది దైవకృప వల్లే సంభవమైనట్లుగా ఎక్కడి భక్తులు నమ్ముతూ ఈ వృక్షానికి రుద్రాక్ష మాలలు సమర్పించి పూజలు జరుపుతూ ఉంటారు. దీనితో రాసిన నరసింహని నోరువలే ఉన్నందువల్ల దీన్ని నారసింహ వృక్షం అంటున్నారు.
అక్షయవటము:- తాటి కోల పద్మావతి
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి