పాఠశాలలు సృజనాత్మక కేంద్రాలుగా విలసిల్లినప్పుడే విద్యార్థులు స్వేచ్ఛాయుత అభ్యసనం కొనసాగించగలరని నకిరేకల్ మండల విద్యాధికారి మేక నాగయ్య అన్నారు. శనివారం తాటికల్ పాఠశాలలో జరిగిన బాల కవి సమ్మేళనానికి హాజరై ఆయన ప్రసంగించారు. ఈ సందర్భంగా నాగయ్య మాట్లాడుతూ కవిత్వం రాయడం ఆలోచనకు పదును పెడుతుందన్నారు. విద్యార్థి దశలోనే కవిత్వం రాయడం అలవర్చుకోవాలని సూచించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన యోగా గురువు మాదగాని శంకరయ్య మాట్లాడుతూ ఉగాది పర్వదినం వంటి సంప్రదాయాలను వాటి వెనుక ఉన్న శాస్త్రీయతను ముందు తరాలకు అందించడానికి ఇటువంటి కార్యక్రమాలు దోహదపడతాయన్నారు. మరొక అతిధి ఎంఏ కరీం మాట్లాడుతూ మన చుట్టూ ఉన్న పరిసరాల నుండే కవిత్వపు వస్తువు స్వీకరించి పాటగా, పద్యంగా, కవితగా, కథగా వ్యక్తికరించాలని సూచించారు. పదిహేను మంది బాలకవులు చదివిన కవితలు సభికులను అలరించాయి. అనంతరం బాల కవులను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు ప్రజ్ఞాపురం వెంకన్న, పండుగ తిరుమలయ్య, మోసంగి హరీష్ చంద్ర, మార్త రాములు, డాక్టర్ సాగర్ల సత్తయ్య, నర్రా వెంకట్ రెడ్డి, లొట్లపల్లి కోటయ్య, నూకల జానయ్య, పద్మ తదితరులు పాల్గొన్నారు.
పాఠశాలలు సృజనాత్మక కేంద్రాలు కావాలి

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి