వెంటాడే స్వప్నాలు
వేటాడే సత్యాలు
వేడుక ఇమ్మని వేడితే
వేదనలే బహుమతులు
ఎదురుచూసిన పండుగ
ఎద పొంగింపగ నిండుగా
ఎదుటే నిలిచే సమయం
ఎరుగదుగా హృదయం..
తడియారని తపనలే
సుడి తిరిగే గుండెలో
ముడి పడిన ముచ్చటేదో
సడి సవ్వడి లేక మాయం!
బీడు నేల చిగురించగ
వేడు మదికి కానుకగా
వేల పూల నికుంజములు
వేడుకగా విరిసి మురిసె మనం!
ఇడుములన్నీ ఒకటొకటిగా
తొలగిపోవు క్షణాలేవో
కడు సమీప కాలమందు
కలిసి వచ్చు సూచనగా!
కలలు తీరి కమ్మగా
కనుల మెరుపు నిండగా
కదిలి కురియు కన్నీట
కలత కరిగి పోవుగా!
స్వప్నం సత్యమయే వేకువకు
🌸🌸 సుప్రభాతం🌸🌸
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి