న్యాయములు-799
"అర్థో ఘటో ఘోష ముపైతి నూనమ్ "న్యాయము
*****
అర్థ అనగా సగము.ఘట అనగా కుండ.ఘోష అనగా శబ్దం, సవ్వడి, ధ్వని, బిగ్గరగా శబ్దంతో చెప్పండి.ముపైతి అనగా సృష్టిస్తుంది.నూనమ్ అనగా తప్పకుండా, ఖచ్చితంగా , ఎల్లప్పుడూ అనే అర్థాలు ఉన్నాయి.
సగము కుండ ఎక్కువ శబ్దం చేస్తుంది.అని అర్థం. దీనినే మనుషులకు ఆపాదించి " వెల్తి మొహానికి ఆశ ఎక్కువ అహం ఎక్కువ" అంటుంటారు.
అంతే కాదు"ఓటి కుండకు మోత ఎక్కువ" అని కూడా అంటారు.
ఈ న్యాయము లోని వాక్యము యొక్క పూర్తి శ్లోకాన్ని చూద్దామా...
సంపూర్ణ కుంభో న కరోతి శబ్దం/ అర్థో ఘటో ఘోషముపేతి నూనం!!/ విద్వాన్ కులినో న బహూన వీర్తీ!!"
అనగా నీటితో నిండిన కుండ ఎటువంటి చప్పుడు చేయకుండా ఉంటుంది.ఎలాంటి ద్వనిని సృష్టించదు. అయితే సగం నిండిన కుండ ఎల్లప్పుడూ పెద్ద ద్వనిని సృష్టిస్తుంది. దీనిని బట్టి జ్ఞాన వంతులు మరియు గొప్ప వ్యక్తులు తమ విజయాల పట్ల ఎప్పుడూ గర్వాన్ని ప్రదర్శించరు. ఎటువంటి మంచి, గొప్ప లక్షణాలు లేని వ్యక్తులు మాత్రం తమ విజయాల గురించి గొప్పగా చెప్పుకొని గర్వపడుతుంటారు.
"నిండు కుండ తొణకదు , చప్పుడు చేయదు అన్న వాళ్ళే ఓటి కుండ లేదా సగం కుండకు మోత ఎక్కువ అని గొప్పవారిని నీచులను పోలుస్తూ చెబుతుంటారు.
బాగా జ్ఞానంతో నిండిన వారు తమకు ఉన్న జ్ఞానాన్ని అతిగా ప్రదర్శించరు.తక్కువగా మాట్లాడుతారు అహంకారం చూపరు.
అయితే కొంతమంది అహంకారాన్ని ఆయుధంగా వాడుతుంటారు.అహంకారం అనేది వారిలో అణువణువునా ఉంటుంది.ఇలాంటి వారికి ఎలాంటి ఎదురుదెబ్బలు ఎన్ని తగిలినా మార్పు రాదు వీరికి తెలిసిన జ్ఞానమంతా మిడిమిడి జ్ఞానమే.
సజ్జనులు సత్యం తెలిసిన వారు. కూడా నిండు కుండ లాంటి వారే.అలాంటి వారితోనే స్నేహం చేయాలి.ఆత్మ విజ్ఞానం లేని వాళ్ళకు జీవితం చాలా దుర్భరంగా ఉంటుంది. వాళ్ళు పెద్దగా అరుస్తూ ఇతరులపై ఆధిపత్యం చెలాయిస్తూ ఉంటారు.
అర్థ ఘటం లాంటి వారికి ఏదీ పూర్తిగా తెలియదు.అంతా సగం సగమే. ఇలా కొంచెం కొంచెం తెలియడం చాలా ప్రమాదకరం. వారి మాటలు,చేతలూ రెండూ ఇతరులను నొన్నిస్తాయి.
ఇలాంటి వారిలో కొంచెమైనా చెప్పితే వినాలనే ఆలోచనా స్వభావం ఉంటే చాలు. వారిలో మిగతా సగం విజ్ఞానంతో నింపితే గొప్ప వారు అయ్యే అవకాశం ఉంటుంది.
ఇదండీ! అర్థో ఘటో ఘోషముపతి నూనమ్" న్యాయము లోని అంతరార్థము.ఇది తెలుసుకుని ఖాళీగా ఉన్న మనసు నిండా విజ్ఞానాన్ని నింపుకుందాం.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి