చిత్ర స్పందన : - ఉండ్రాళ్ళ రాజేశం

 మత్తకోకిల

ఎండకాలము వచ్చినంతన ఎండిపోవును పైరులూ
నిండుకుండల బావులందున నీటి వూటలు తగ్గగా
కండగల్గిన రైతుగుండెల కంటనీరులు పారగా
బండరాయిగ కాళ్ళుకాలిన బాటసాగును కర్షకుల్

 
కామెంట్‌లు