రంగ 9వ తరగతి చదువుతున్నాడు. పెద్ద సోమరిపోతు. ఇంటి వద్ద ఏ పనీ చేయడు. బయటికి వెళ్ళి గంటల తరబడి ఆటలు ఆడి రావడం, టీవీలు, మొబైల్ ఫోన్లకు బానిసలు కావడం రంగ నిత్య కృత్యం. ఇంట్లో బయటి పనులు ఏవి చేయాలన్నా రంగ చెల్లెలు 6వ తరగతి చదువుతున్న అపర్ణనే.
చదువు రాదు. ఆటలతో కాలక్షేపం. ఇంట్లో ఏమీ పట్టించుకోడు. ఇది రంగ తీరు. ఒకరోజు రంగ వాళ్ళ అమ్మకు బాగా జ్వరం వచ్చింది. ఇంటికి వచ్చిన డాక్టర్ మందులు రాసి, తీసుకు రమ్మన్నాడు. బయటికి వెళ్ళిన రంగ పని వదలి పెట్టి స్నేహితులతో ఆటల్లో మునిగి ఎంతకూ రావడం లేదు. రంగ చెల్లెలు అపర్ణ అన్నను వెతుక్కుంటూ వెళ్ళి, అన్న దగ్గర మందుల చీటీ, డబ్బులు తీసుకున్నది. అపర్ణ వెంట శ్రుతి, స్రవంతి వచ్చారు. వీరిద్దరూ రంగ ఇంటి పొరుగునే ఉంటారు. రంగ క్లాస్ మేట్స్. అపర్ణను అక్కడే ఉన్న తుమ్మచెట్టు ఆకర్షించింది. కారణం ఆ పెద్ద తుమ్మచెట్టు మీద ఎన్నో గిజిగాని గూళ్ళు ఉన్నాయి. "అబ్బ! ఈ పక్షులు ఎంత అందంగా ఉన్నాయి. ఇంత చిన్న పక్షులు ఇంత అందమైన గూళ్ళు ఎలా కట్టగలిగాయి. చూస్తుంటే ఇక్కడే ఉండి పోవాలి అనిపిస్తుంది." అన్నది అపర్ణ. "ఇంత చిన్న పక్షులు అంత ఆకర్షణీయంగా గూళ్ళను కట్టుకోవడం అద్భుతం. అదే మనిషి చూడు. ఈ గిజిగాని కంటే వేల రెట్లు పెద్దగా ఉంటాడు. సోమరితనంతో తినడం, తిరగడం తప్ప ఎందుకూ పనికిరాడు. ఇంటి పనులు కూడా చేతకాదు. అలాంటి వాడు ఉండి ఏం లాభం?" అన్నది శ్రుతి. స్రవంతి రంగను చూస్తూ బాగా నవ్వింది.
"ఇకనైనా ఈ బుల్లి గురువులను చూసి కొంతమంది బుద్ధి తెచ్చుకుంటే మంచిది." అన్నది అపర్ణ. రంగ సిగ్గుతో తల దించుకున్నాడు. ఇంటి పట్టునే ఉండి చదువుకుంటూ, ఇంట్లో సహాయం చేస్తున్నాడు

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి