వీరవనిత:- డా.భరద్వాజ రావినూతల-కొత్తపట్నం
జైహో సాహో సునీత, శోభిత నీ జీవితం,
గగనాల్ని తాకిన గౌరవం నీ మౌన గీతం.
నింగిలో ఎగిరిన నక్షత్రమెరుగు,
భువిని వెలిగించిన దీపమెరుగూ!

అడుగులు అస్తమించని ఓ వెలుగు నీది,
ఆకాశపు విశ్వదీప్తి నీ ధైర్య గాధ.
ఆశయాలకు రెక్కలు జోడించి,
అంతరిక్షం చేరిన ఆజ్ఞాన తెరచినావు.

నవ చైతన్య నదిలా ప్రవహించే నీ జ్ఞానం,
విజయ రథసారథిగా మారిన నీ తపనం.
భూమి మీద నీ అడుగుల గుర్తులు,
భవిష్యత్ తరం చూసే మార్గదర్శి అవుతాయి.

సాహసమే నీ సమాధానం, ధైర్యమే నీ లక్ష్యం,
సాధన నీ ఆయుధం, విజయమే నీ పథం.
జైహో సాహో సునీత, అమరంగా నిలిచే నీ పేరు,
తెలుగు తల్లి ముద్దుబిడ్డగా వెలిగే నీ కీర్తి!
☘️🌲🌲☘️🌲☘️🌲☘️🌲☘️


కామెంట్‌లు