హిరణ్య కశిపుడు తనను ధిక్కరించి విష్ణు ఆరాధన చేస్తున్న ప్రహ్లాదుడిపై తీవ్రంగా ఆగ్రహించాడు. ఎవరి శక్తితో నువ్వు ఇంత మూర్ఖంగా, మొండిగా, భయం లేనివాడిలా ఉంటున్నావు? నేను శాసించినా ఎందుకు లెక్క చెయ్యడం లేదు? అని ప్రశ్నించాడు.ప్రహ్లాదుడు బదులిస్తూ మీరు ఎవరి ద్వారా శక్తియుక్తులు పొందుతున్నారో... నా శక్తికి కూడా అతడే మూలాధారం. అతడే సకల శక్తులకూ మూలమైన పరంధాముడు... శ్రీహరి’’ అని వినయంగా చెప్పాడు. ప్రహ్లాదుడి మాటలకు ఆగ్రహించిన హిరణ్యకశిపుడు ఏవరీ శ్రీహరి ?ఆయన ఎక్కడుంటాడు ?వాడే సమస్తంలోనూ ఉన్నట్టయితే... నా ముందున్న ఈ స్తంభంలో చూపించగలవా?’’ అని అడిగాడు.సర్వవ్యాప్తుడైన భగవంతుడు ఆ స్తంభంలో కూడా తప్పక ఉన్నాడని ప్రహ్లాదుడు నిస్సంకోచంగా సమాధానం ఇచ్చాడు. అది విన్న హిరణ్యకశిపుడు వెంటనే తన సింహాసనం నుంచి లేచి... పిడికిలితో స్తంభాన్ని పగలగొట్టాడు. ఆ స్తంభం నుంచి నర-మృగ... శరీరంతో నరసింహావతారుడై స్వామి ఆవిర్భవించాడు. ప్రహ్లాదుడు భగవంతుడిని సర్వాతర్యామిగా నమ్మ్మి కొలిచాడు. ఆ బాలుడు నమ్మికను భగవంతుడు అంగీకరించి సందర్భం వచ్చినప్పుడు స్థంభంలో నుండి ఆవిర్భవించి భక్తుల నమ్మకాన్ని తానెప్పుడూ వమ్ము చేయనని నిరూపించాడు. భగవంతుడు సర్వాంతర్యామి అనీ, రాజమందిరంలోని స్తంభంలో సైతం భగవంతుడు ఉన్నాడని చెప్పిన ప్రహ్లాదుడి మాటలను నిరూపించడానికే... దేవదేవుడైన శ్రీహరి అంతకుముందు నృసింహ రూపంలో అవతరించాడని ‘శ్రీమద్భాగవతం’ వివరిస్తోంది.భక్త రామదాసు భద్రాచలం ఆలయంలో ప్రతిష్టించబడిన శ్రీరాముడిని పూజించాడు. ఆయన తన సంపాదన, ఆస్తులన్నింటినీ శ్రీరాముడికి అర్పించాడు. రెవెన్యూ అధికారిగా తాను వసూలు చేసిన డబ్బును కూడా రాముడికి ఆలయం నిర్మించడానికి, ఆలయంలోని దేవతలకు ఆభరణాలు తయారు చేయడానికి అంకితం చేశాడు. తానీషా అతన్ని వేధించినప్పుడు, తాను రాముడికి అన్నీ అర్పించానని, తన సొంత కోరికలు ఏవీ పెంచుకోలేదని ప్రకటించాడు. "నేను రాముడికి పూర్తిగా లొంగిపోయాను" అని ఆయన ప్రకటించాడు. ఆయన ఈ విధంగా దేవుని సర్వవ్యాప్తిని గుర్తించారు. దేవుడు అందరికీ అత్యున్నత రక్షకుడని వారు దృఢంగా విశ్వసించారు. వారు నిజంగా భాగవతులు - దేవుని భక్తులు.హిందూ పురాణాల ప్రకారం దేవుడు సర్వాంతర్యామి అయినప్పటికీ ఆలయాల్లో, తీర్థ స్థలాల్లో త్వరగా అనుగ్రహిస్తాడని విశ్వాసం. అందుకే దేవాలయ సందర్శనం, తీర్థయాత్రలు చేయడం హిందూ సంస్కృతిలో భాగం. అయితే దేవాలయాలు, పుణ్యక్షేత్రాలు సందర్శించడం వెనుక శాస్త్రీయ కోణం కూడా ఉంది.
అనన్యాశ్చింతయంతో మాం యే జనాః పర్యుపాసతే
తేషాం నిత్యాభి యుక్తానాం యోగక్షేమం మహామ్యహమ్
‘అనన్యంగా నన్నెవరైతే చింతిస్తూ (స్మరిస్తూ) ఉంటారో.. వారి యోగక్షేమాలు నేనే చూసుకుంటాను’ అని భావం. దాన్ని అనుసరించి భగవద్రక్షణ అతనికి లభించింది. ఆ భక్తుడు మాయా పరిధిలోని వాడే అయినా.. మాయాతీతుడైన భగవంతుని శరణు పొందిన వాడు. కాబట్టి మాయ అతని మీద తన ప్రభావం చూపించలేదు.
అనన్యాశ్చింతయంతో మాం యే జనాః పర్యుపాసతే
తేషాం నిత్యాభి యుక్తానాం యోగక్షేమం మహామ్యహమ్
‘అనన్యంగా నన్నెవరైతే చింతిస్తూ (స్మరిస్తూ) ఉంటారో.. వారి యోగక్షేమాలు నేనే చూసుకుంటాను’ అని భావం. దాన్ని అనుసరించి భగవద్రక్షణ అతనికి లభించింది. ఆ భక్తుడు మాయా పరిధిలోని వాడే అయినా.. మాయాతీతుడైన భగవంతుని శరణు పొందిన వాడు. కాబట్టి మాయ అతని మీద తన ప్రభావం చూపించలేదు.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి