విశాఖపట్నం ముడసర్లోవ పార్క్ లో రాష్ట్రపతి పురస్కార గ్రహీత కుదమ తిరుమలరావుకు ఘన సన్మానం జరిగింది. తిరుమలరావు 2009లో న్యూఢిల్లీలో రాష్ట్రపతి ప్రతిభా పాటిల్ చేతులమీదుగా జాతీయ స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారాన్ని అందుకున్న నేపథ్యంలో ఈ సన్మానం ప్రత్యేకతను సంతరించుకుంది.
కుటుంబ బాంధవ్యాల పవిత్రతను పెంచేందుకు అత్యంత వైభవంగా అందమైన కుటుంబం ఆత్మీయ సమ్మేళనం నిర్వహించామని కమిటీ అధ్యక్షులు కుదమ పరమేశ్వరరావు తెలిపారు. ఎనభై కుటుంబాలకు చెందిన మూడువందల మందికి పైగా బంధుగణం పాల్గొని తమ తమ ఆప్యాయతలను, అనురాగాలను పంచుకున్నారని ప్రధాన కార్యదర్శి కె.గోపి అన్నారు.
ఈ అనుబంధాల సమ్మేళన వేదికపై కొందరిని ప్రముఖులుగా గుర్తించి సన్మానించడం జరిగిందని ఆర్గనైజింగ్ సెక్రటరీ కె.శ్రీనివాసరావు తెలిపారు. ఐతే తమ బంధు గణమందు రాష్ట్రపతి పురస్కారాన్ని అందుకున్న ఏకైక వ్యక్తి కుదమ తిరుమలరావు అని, మా బంధువులందరికీ గర్వకారణంగా నిలిచారని కమిటీ కోశాధికారి అరసాడ రఘుపతిరావు తెలిపారు. కుదమ తిరుమలరావు 1967లో పార్వతీపురం మన్యం జిల్లా, జియ్యమ్మవలస మండలం, కుదమ గ్రామంలో జ్యోతి, నరసింగరావు బాబయ్య పట్నాయక్ లనే పుణ్య దంపతులకు నాల్గవ పుత్రునిగా జన్మించిరి. తిరుమలరావు ఇరవై రెండేళ్ళకే 1989లో సెకండరీ గ్రేడ్ టీచర్ గా శ్రీకాకుళం జిల్లా, భామిని మండలం, పసుకుడిలో ప్రభుత్వ ఉద్యోగంలో చేరారు. ఆటపాటలతో, చిత్రలేఖన కళలతో, సాంస్కృతిక కార్యక్రమాలతో అలరిస్తూ, గుణాత్మకమైన విద్యను అందించేలా పాఠాలను బోధిస్తూ తిరుమలరావు నిరంతర శ్రామికునిగా కృషి చేస్తూ ఉంటారు.
ఆయన కేవలం పదేళ్ల సర్వీస్ లోనే 1999లో శ్రీకాకుళం జిల్లా కేంద్రంలో ప్రభుత్వం వారిచే జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారం అందుకున్నారు. పదహారేళ్ళ సర్వీస్ లోనే 2005లో రాష్ట్ర స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారాన్ని సికింద్రాబాద్ హరిహర కళాభవన్ లో నాటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి చేతులమీదుగా స్వీకరించారు. కేవలం ఇరవై ఏళ్ల సర్వీస్ లోనే 2009 జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారాన్ని న్యూఢిల్లీలో రాష్ట్రపతి ప్రతిభా పాటిల్, ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ ల చేతులమీదుగా పొందారు. రచనలతో, పాటలతో, చిత్రలేఖనంతో విద్యాప్రమాణాలు పెంచుట ద్వారా తిరుమలరావు పనిచేస్తున్న పాఠశాలలు సైతం ఉత్తమ పాఠశాలలుగా తీర్చిదిద్దబడ్డాయి. మరోవైపు కవితలు, వ్యాసాలు, కథలు, పాటలు మున్నగు అంశాలయందు కూడా తనదైనశైలిలో సృజనాత్మకతతో రాణించి, పెక్కు పురస్కారాలను పొందారు. జాతీయ స్థాయిలో ఉత్తమ ఎన్యూమరేటర్ గా సెన్సస్ 2001 అవార్డును పొందిన తిరుమలరావు, అక్షరక్రాంతి జన్మభూమి చదువులపండుగ సిక్కోలు సంబరాలు, తెలుగు వికాసం, గోదావరి కృష్ణా పుష్కరాల పురస్కారాలు, ఉగాది, అక్షర సంక్రాంతి మున్నగు ప్రభుత్వ పథకాలన్నింటా వందకు పైగా పురస్కారాలు పొందారు. బెంగళూరులో తెలుగు తేజం, విజయనగరంలో విద్యాభారతి బిరుదాంకిత ఉగాది పురస్కారం, హైదరాబాద్ లో తెలుగు కళా వైభవం సహస్ర కవిమిత్ర బిరుదాంకిత పురస్కారం, పొద్దుటూరులో తెలుగు దీప్తి పురస్కారం, అనంతపురంలో తెలుగు రక్షణ వేదిక పురస్కారం, అంతర్వేదిలో తెలుగు బుక్ ఆఫ్ రికార్డులు వంటి పలు పురస్కారాలు వందకు పైగా పొందారు తిరుమలరావు.
కుదమ తిరుమలరావు ధర్మపత్ని ఐన సుకన్య, ప్రస్తుతం రాజాం సెంటాన్స్ స్కూల్ లో హిందీ పండిట్ గా పనిచేస్తున్నారు. ఏకైక సంతానం స్నేహ, అల్లుడు సందీప్ లు హైదరాబాద్ లో స్థిరపడిరి. ఇంకా నాలుగేళ్ల పైబడి సర్వీస్ ఉన్న తిరుమలరావు ప్రస్తుతం శ్రీకాకుళం జిల్లా కొత్తూరు మండలం కడుము జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సాంఘిక శాస్త్రోపాధ్యాయునిగా పనిచేస్తున్నారు. తిరుమలరావు అన్నయ్య కుదమ పరమేశ్వరరావు కూడా రాష్ట్ర స్థాయి ఉత్తమ సైన్స్ ఉపాధ్యాయునిగా ఆనాటి ముఖ్యమంత్రి కె.రోశయ్య చేతులమీదుగా పురస్కారాన్ని అందుకున్నారు. విజయనగరం జిల్లా మెంటాడ మండల విద్యాశాఖాధికారిగా విశేషమైన సేవలను అందించి పదవీవిరమణ గావించారు పరమేశ్వరరావు. అందమైన కుటుంబం కమిటీ అధ్యక్షులు కుదమ పరమేశ్వరరావు,
ప్రధాన కార్యదర్శి కుదమ గోపి,
ఆర్గనైజింగ్ సెక్రటరీ కె.శ్రీనివాసరావు,
కోశాధికారిగా అరసాడ రఘుపతిరావు,
గౌరవసలహాదారులు కుదమ కృష్ణారావు, భాస్కరరావు,
కె.అరంజ్యోతి, తుంబలి యజ్ఞేశ్వరరావు, బగ్గాం ధనంజయరావు,
గౌరవాధ్యక్షులు ఆర్వీ పట్నాయక్, ఎస్.కె.గోవిందరావు, ఎం.పి.గౌరీశంకరరావు,
మహిళా కార్యదర్శులు అలివేలు, లత, కృష్ణసాయి, విజయ, రాధ, శాంతి, సుకన్య, లక్ష్మి, భాషిణి,
కల్చరల్ కమిటీ కార్యదర్శులు కె.వెంకటచలపతిరావు, ఎ.హరనాథరావు, వి.స్వర్ణసాయిసుధ, పాల్తేరు మాధవరావు, కె.మధుసూదనరావు, సాలూరు రామకృష్ణ,
ఉపాధ్యక్షులు తట్టికోట గణపతిరావు, ఎ.వాసుదేవరావు, కె.వి.చలపతిరావు, పక్కి మధుసూదనరావు, కె.నాగభూషణరావు,
సహకార్యదర్శులు నడుకూరు విజయకుమార్, కె.మధుభాను కుమార్ పట్నాయక్, ఎన్.శ్రీనివాసరావు, కె.సంతోష్ కుమార్,
ఆహ్వాన కమిటీ సభ్యులు కె.సత్యసాయిబాబా, కె.రమేష్, మల్లేశ్వరరావు, పక్కి తులసీదాస్, కె.రవి, రేగులవలస రవి, ఎ.తిరుపతిరావు, కె.రామ్ ప్రసాద్,
దేవీప్రసాద్ పట్నాయక్, పి.రామదాస్ లు తిరుమలరావు సేవలను ప్రశంసించారు.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి