మహోన్నత వృక్షాలు. :-తాటి కోల పద్మావతి గుంటూరు.

 జ్ఞాన మర్రి. 

ఆసియా పసిఫిక్ ప్రాంతంలోని ఇండోనేషియాలోని ఒక గ్రామంలో ఈ మర్రి ఆకులతో కూడి బలిష్టంగా పెరిగిన అతి పెద్ద వృక్షం వేసవిలో అక్కడ ప్రజలు ఈ వృక్షం నీడలోనే సేద తీర్చుకుంటారు. ఇది వయోభారంతో జ్ఞాన సంపదకు చిహ్నంగా ఉందని దీనిని ఒక వృద్ధునిగా భావించి అక్కడివారు తమ కష్టసుఖాలను చెప్పుకుంటారు. 
అప్పుడు వారి సమస్యలకు సమాధానాలు కూడా దొరుకుతాయని నమ్ముతారు. ఎంతో విశిష్టంగా భావించే ఈ మర్రిని"జ్ఞానవటం"అని అక్కడివారు అభివర్ణిస్తారు. కైలాసంలో పరమశివుడు దక్షిణామూర్తి అనే పేరుతో భద్రవటం అనే మర్రి క్రిందనే కూర్చుని చిన్ముద్రలో తన శిష్యులకు మౌన వ్యాఖ్యానం చేస్తుంటాడు. అందువల్ల కూడా మర్రిని జ్ఞానవృక్షం అనవచ్చు. 

కామెంట్‌లు