కార్యసిద్ధి మంత్రం:-సి.హెచ్.ప్రతాప్
సుందరకాండలో హనుమంతుడు సీతను వెతుక్కుంటూ సముద్రాలు దాటి లంకలో ప్రవేశించి, అశోకవనంలో ఉన్న సీత దగ్గరకు వెళ్లిన సందర్భంలో శోకంలో ఉన్న సీతాదేవి హనుమంతుడికి ఒక కార్యసిద్ధి మంత్రాన్ని ఉపదేశిస్తుంది.

త్వమస్మిన్ కార్య నిర్యోగే ప్రమాణం హరి సత్తమ
హనుమన్ యత్నమాస్థాయ దుఃఖక్షయకరో భవ (సుందరకాండ - 5.39.4)

ఈ మంత్రమును సీతాదేవి హనుమంతుడికి ఉపదేశిస్తూ హనుమా!! నేను చాలా దుఃఖంలో ఉన్నాను. నన్ను ఈ కష్టాల నుండి గట్టెక్కించగల సమర్థుడివి నువ్వే.ఇదిగో ఈ మంత్రం సిద్ధి పొంది తద్వారా నన్ను అనుగ్రహించు. ఇది నీవల్లనే సాధ్యమవుతుంది అని చెప్పిందట.దానితో హనుమంతుడు సీతాదేవి చెప్పిన మంత్రాన్ని జపం చేస్తూ దాన్ని సిద్ధి పొంది సీతాదేవి రావణుని చేర నుండి విముక్తి పొందే మార్గాన్ని సులువు చేయగలిగాడని పురాణ కథనం.దీన్ని ప్రతిరోజు 108 సార్లు, 40 రోజుల పాటు చెప్పుకోవడం వల్ల అనుకున్న పనులు సక్రమంగా జరుగుతాయి. ఈ మంత్రాన్ని మంగళవారం లేదా శనివారం పూట పఠించడం ప్రారంభించాలి. ముఖ్యంగా శనివారం పూట సంధ్యాసమయంలో శుచిగా స్నానమాచరించి హనుమాన్ ఆలయాన్ని సందర్శించుకుని ఈ కార్యసిద్ధి మంత్రాన్ని పఠించాలి. ఈ మంత్రాన్ని 1110 సార్లు.. 40రోజుల పాటు పఠిస్తే మీరుకు అనుకున్న కార్యం సిద్ధిస్తుంది. ఇంకా ఈతిబాధలు తొలగిపోతాయి. ఈ మంత్ర పఠనం ద్వారా శత్రుభయం తొలగిపోతుంది. హనుమంతుడు కార్యసాధకుడు. భక్తితో హనుమంతుడిని కొలిచిన వారికి వారి కోరికలు తప్పక నెరవేరతాయి. భక్తులు వారి వారి కోరికను అనుసరించి ఆంజనేయ శ్లోకాలను భక్తితో స్మరిస్తే కార్యసిద్ధి సాధించగలుగుతారు.

కార్య సిద్ధి కోసం హనుమాన్ స్తుతి రోజు 11 సార్లు చదువుకోమని శాస్త్రం ఉపదేశిస్తోంది.


శ్రీ రామ దూత మహా ధీర
రుద్ర వీర్య సముద్భవ
అంజనా గర్భ సంభూతే
వాయు పుత్రా నమోస్తుతే

 అసాధ్య సాధక స్వామిం
అసాధ్యం తవ కిం వద
శ్రీ రామ దూత కృపా సింధో
మత్కార్యం సాధయ ప్రభో

ఈ శ్లోకాలను ఆయా కార్యసిద్ధిని కోరుకునేవారు 40 దినాలు నిష్ఠతో స్మరిస్తూ, ప్రతిరోజు ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళి శక్తికొద్దీ ప్రదక్షిణ సంఖ్యా నియమాన్ని అనుసరించి ప్రదక్షణాలు చేసి ఆ స్వామిని పూజిస్తే తమ తమ కార్యాలలో విజేతలు అవుతారు.
కామెంట్‌లు