ఆకురాలి చిగురు తొడిగినట్లు
ఆవిరి మేఘమై చినుకు కురిసినట్లు
మండ మొగ్గ తొడిగి పువ్వై పూసినట్లు
పువ్వులో పరిమళం మకరందం ఊరినట్లు
గాలి పైరగాలిలా
మైదానం అంతా వీంచినట్లు
తోటలో మళ్లీయలు
మాటలు పాటలతో గాల్లో తేలినట్లు
పొద్దుపొడుపు
వాకిలి ముందు ముగ్గై వాలినట్లు
గానం గంధర్వ ప్రాణమై
వేణువు లూదినట్లు
కడలి విడిచి చేప ప్రాణం విడిచినట్లు
కడలి చేరి నది దారి మరిచినట్లు
ఎడారి ఓడ ఇసుక తుపాను కు గడగడ వణికినట్లు
చెలిమే ఊరి గొంతు తడిపినట్లు
మోము మోహం దాహం తీరినట్లు
కవిత ఒకటి పుట్టింది
కవితా దినోత్సవం జరుపుకుంది.
లత కు అంకితం
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి