అప్పు...ఒక అగ్నిప్రమాదం...
తప్పు...ఒక తప్పటడుగు...
నిప్పు...ఒక నిర్దాక్షిణ్యపు శిక్ష...
ఒప్పు...ఒక శాంతియుత ఒప్పందం..!
అప్పు...
అప్పు చేయనివాడు అవనిలో
కాగడా పట్టి వెతికినా కానరాడు...
అవసరానికి అప్పు అండగా ...
తోడు నీడగా నడిచినా...
కడకది బాదుడే భరించలేని బరువే..!
తప్పు...
తీరం చేరక తెగిపడే తపన...
వెంటాడే నిట్టూర్పుల నిశ్శబ్దం...
తెలిసి తెలిసి చేయకు తప్పు...చేస్తే
ఒప్పుకో అదే మనశ్శాంతికి మందు..!
నిప్పు...
తీరని అప్పు ఆరని నిప్పే...
అది నిప్పు కణికలపై నడకే...
ఆవహించేది అవమానమే...
ఆపై జరిగేది ఆత్మ దహనమే..!
ఒప్పు...
చేసిన నేరాన్ని ఒప్పుకున్నా...
చేసిన అప్పును తీర్చినా గౌరవమే...
అది మానవతకు ఒక ఆమోదముద్రే..!
ఓ మనిషీ...ఒక్కమాట...
నీ మనసులో ప్రశాంతత ప్రహించనియ్...
పేదవాడిగా జన్మించడం కాదు శాపం...
పేదవాడిగా మరణించడమే మహాపాపం..!
అవసరాల కోసం
అప్పు చేయడం కాదు నేరం
పీకలదాకా అప్పులు చేసి విదేశాలలో
విహారయాత్రలు చేయడం...
విలాసవంతమైన జీవితం గడపడం...
"తీరని అప్పు...ఒక ఆరని నిప్పని"...
తెలుసుకోకపోవడం ఒక నేరం మహాఘరం..!
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి