-ఊషన్నపల్లి పాఠశాలలో 'వారానికో వక్త' కార్యక్రమ నిర్వహణ
-పిల్లలకు పంటల రకాలపై అవగాహన
పాఠశాల పిల్లలు ఇష్టపడి చదువుతేనే వారికి ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని కాల్వశ్రీరాంపూర్ మండల వ్యవసాయాధికారి నాగార్జున అన్నారు. సోమవారం ఆయన కాల్వశ్రీరాంపూర్ మండలం ఊషన్నపల్లి ఇంగ్లీష్ మీడియం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల (స్వయం అభ్యసన కేంద్రం) లో 'వారానికో వక్త' కార్యక్రమంలో భాగంగా భోజన విరామ సమయంలో 'పంటలు - రకాలు' అనే అంశంపై మాట్లాడారు. పాఠశాల పిల్లలకు వివిధ అంశాలపై అవగాహన కలిగించేందుకు ఊషన్నపల్లి పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఈర్ల సమ్మయ్య 'వారానికోవక్త' కార్యక్రమాన్ని ప్రారంభించిన విషయం విదితమే. ప్రతి వారం పాఠశాలకు ఒక ముఖ్య అతిథిని పిలిపించి వివిధ విషయాలపై ప్రసంగాలు ఇప్పిస్తుంటారు. అందులో భాగంగా సోమవారం మండల వ్యవసాయాధికారిని పాఠశాలకు ఆహ్వానించి 'పంటలు - రకాలు' అనే అంశంపై పిల్లలకు అవగాహన కల్పించారు. అలాగే సాధారణ, వ్యాపార పంటలు, ఎరువులు, పురుగు మందుల గురించి పిల్లలకు వివరించారు. పిల్లలు చిన్నప్పటి నుంచి అన్ని సబ్జెక్టులను ఇష్టపడుతూ బాగా చదవడం వల్ల ఉన్నత స్థానంలో స్థిరపడవచ్చని, ఆ దిశగా పిల్లలు ప్రయత్నించాలని నాగార్జున కోరారు. తర్వాత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఈర్ల సమ్మయ్య మాట్లాడుతూ పిల్లలు ఏకాగ్రతతో చదివినప్పుడు అద్భుతమైన ఫలితాలు సాధిస్తారన్నారు. ఊషన్నపల్లి పాఠశాలలో చదువుతున్న పిల్లల్లోని అంతర్గత శక్తుల్ని వెలికి తీసి, వారిని ఉన్నతులుగా తీర్చిదిద్దుతున్నామన్నారు. తల్లిదండ్రులు తమ పిల్లల్ని
ఊషన్నపల్లి ప్రభుత్వ పాఠశాలలోనే చదివించాలని ఈర్ల సమ్మయ్య కోరారు. అనంతరం పాఠశాలలో నాలుగో తరగతి విద్యార్థిని పొన్నాల శ్రీనిధి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. శ్రీనిధి నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో విద్యా బుద్ధులతో వర్ధిల్లాలని ఎఓ నాగార్జున, హెచ్ఎం ఈర్ల సమ్మయ్య, టీచర్ శ్రీవాణి ఆమెను దీవించి ఆశీర్వదించారు. పిల్లలు జన్మదిన వేడుకల పాట పాడుతూ శ్రీనిధికి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా మిఠాయిలు పంచుతూ సంబరాలు జరుపుకున్నారు. కార్యక్రమంలో వ్యవసాయాధికారి నాగార్జున, పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఈర్ల సమ్మయ్య, ఉపాధ్యాయిని శ్రీవాణి, పిల్లలు, పలువురు పాల్గొన్నారు.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి