మోహ ముద్గరం:- కొప్పరపు తాయారు

శ్లోకం: 
మూడః కశ్చిన  వైయ్యాకరణో
డుకృణ్కరణాధ్యయన  దురీణః !
శ్రీ మఛ్ఛంకర భగవచ్చిష్యైః 
భోధిత ఆసీచ్ఛోదిత కరణైః !

భావం: ఆత్మజ్ఞానము లేనివాడును, 'డుకృణ్కరణే' అను వ్యాకరణ సూత్రమునీ వల్లె వేయుట యందు మాత్రమూ అగ్రేసరుడైన ఒకానొక వ్యాకరణ శాస్త్రజ్ఞుడు.శ్రీ శంకరభగవతపాదులచేతను వారి శిష్యులు చేతను ఈ విధముగా భోధింపబడి,అంతఃకరణము శుధ్ధి పరుచుకుని తరించెను.
ఈ శ్లోకమును శ్రీ శంకరాచార్యులు వారు చెప్పిరి.

                 ********

కామెంట్‌లు