నిత్య సత్యాలు:- -గద్వాల సోమన్న,ఎమ్మిగనూరు
నిరంతర సాధన
ఆశయాల ఛేదన
అవుతుంది నిజముగా
విజయాలకు నిచ్చెన

గుండెల్లో వేదన
చూడ నరకయాతన
దించుకుంటే మేలు
క్షేమము వేనవేలు

ఎవరినీ చులకన
ఎప్పుడూ హేళన
చేయరాదు బ్రతుకున
ఉండరాదు మనసున

అమ్మ మాట దీవెన
హృదయాలకు సాంత్వన
యోచిస్తే మాత్రము
ఆమె మధుర భావన


కామెంట్‌లు