మహబూబ్ నగర్ పట్టణానికి మూడు కిలోమీటర్ల దూరంలో ఐదు ఎకరాల భూమిలో ఈ వృక్షం ఉన్నది.
ఈ విశిష్ట వృక్షానికి ఒక కథ ప్రచారంలో ఉంది.
అమ్మ పల్లెలో ఒక భక్తుడు తన ఇంటి ముందున్న ఎండు గుంజకు ప్రతినిత్యం ఆ ఇంటికి వచ్చిన అతిధి యొక్క పాత జలము పోసేవాడు. కొంతకాలానికి చిగురించిన ఆ గుంజను ఆ ఊరి కొంత దూరంలో నాటి అక్కడే గురువులకు ఒక ఆశ్రమం కూడా కట్టించారు.
ఆనాటి వృక్షమే ఈనాటి పిల్లలమర్రి. అది శాకోప శాకలై ప్రస్తుతం 3 నుండి 6 ఎకరాలలో 1.2 హెక్టార్లుగా ఉంది. శాఖల విస్తరణ 124 మీటర్లు, శిఖరం పరిధి 385.2500 సంవత్సరముల మహావీర్ జయంతి ఉత్సవ సందర్భంగా 1976లో ఈ పిల్లలమర్రిని ఒక పుణ్యస్థలంగా యాత్రాస్థలంగా నిర్ణయించారు. అయితే ఈ చెట్టు ఊడలు మానులై అసలు మానో తెలియకుండా ఉంది. ఈ చెట్టు కింద కామేశ్వర, కాచేశ్వర, నామేశ్వర లింగాలు ఉన్నాయి.
అందుకే కోరిన కోరికలు తీర్చే వృక్షంగా దీనికి ప్రసిద్ధి.
పసల కాపరులు బాటసారులు, బోధపురం ఆవంచ, ఆలవాని బావి మొదలుకు గ్రామాల నుంచి గంగాపురం ప్రభువుకు పాలు తీసుకెళ్తూ మధ్యలో ఈ ఊడల మర్రి కి గుడ్లు కట్టి పాలకొండలు ఉంచేవారట. అందుకే ఈ ఊరికి పాలమర్రి అని పేరు వచ్చింది.
====================================
రేపు మరి ఒక వృక్షాన్ని పరిచయం చేసుకుందాం.
పిల్లల మర్రి వృక్షం. :- తాటి కోల పద్మావతి.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి