కాల్వశ్రీరాంపూర్ మండలం ఊషన్నపల్లి ఇంగ్లీష్ మీడియం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో చదువుతున్న రెండవ తరగతి విద్యార్థి మామిడి సాత్విక్ జన్మదిన వేడుకలు సోమవారం ఘనంగా నిర్వహించారు. పాఠశాలలో చదువుతున్న పిల్లలందరి పుట్టినరోజు వేడుకలను ప్రధానోపాధ్యాయుడు ఈర్ల సమ్మయ్య ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు, పిల్లలు అందరూ కలిసి ఆనంద, సంతోషాల మధ్య వేడుకగా జరుపుకుంటారు. సోమవారం మామిడి సాత్విక్ జన్మదినాన్ని మిఠాయిలు పంచుతూ ఆనందంగా జరుపుకున్నారు. పిల్లలు ఎగిరి గంతులేశారు. ఈ సందర్భంగా ఈర్ల సమ్మయ్య మాట్లాడుతూ
పిల్లల ఇంటి వాతావరణాన్ని మరిపించే విధంగా పాఠశాలలో వారి స్నేహితుల మధ్య పిల్లల జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నామని చదువు, సంస్కారంతోపాటు వారి ఆనంద సంతోషాల కోసం ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. మామిడి సాత్విక్ నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో, విద్యాబుద్ధులతో వర్ధిల్లాలని ఉపాధ్యాయునీ, ఉపాధ్యాయులు, పిల్లలు కోరారు. కార్యక్రమంలో హెచ్ఎం ఈర్ల సమ్మయ్య, టీచర్లు అమృత సురేష్ కుమార్, కొనుకటి శ్రీవాణి, పిల్లలు పాల్గొన్నారు.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి