రంగ చదువులో చాలా వెనుకబడినాడు. మొబైల్ ఫోన్లు, టీవీలు, స్నేహితులతో క్రికెట్ ఆటలు ఇదీ అతడి టైం పాస్. తల్లిదండ్రులు ఎంత చెప్పినా వృథా. గురువులు దండించినా ఫలితం శూన్యం. చెల్లలు గీతాంజలి తన క్లాసులో ఎప్పుడూ ఫస్ట్ ర్యాంకు. చెల్లెలిని చూసి బుద్ధి తెచ్చుకో అని ఎవ్వరు చెప్పినా వినడు.
ఇప్పుడు రంగ 10వ తరగతికి వచ్చాడు. ఉపాధ్యాయులు మొదట్లోనే తల్లిదండ్రులను పిలిపించి ఈ సారి అయినా ఇంటి వద్ద శ్రద్ధగా చదివించమని మరీ మరీ చెప్పారు. వారి వెంట చెల్లెలు కూడా ఉంది. ఇంటికి వచ్చిన తర్వాత గీతాంజలి అన్నయ్యతో మాట్లాడటం మానేసింది. అన్నయ్య ఎంత బతిమాలినా ఫలితం శూన్యం. చివరికి రంగ శపథం చేసినాడు. ఇక నుంచి సమయం వృథా చేసే వినోదానికి స్వస్తి చెప్పి బుద్ధిగా చదువుకుంటా అని శపథం చేశాడు. అన్నా చెల్లెళ్ళకు మాటలు కలిశాయి.
కాలం గడుస్తుంది. 10వ తరగతి పబ్లిక్ పరీక్షలు మొదలు అయినాయి. రంగ కంబైన్డ్ స్టడీ పేరుతో మధు ఇంటికి వెళ్ళి ఇద్దరూ టీవీల్లో క్రికెట్ చూస్తున్నారు. పరీక్షలు అయిపోయాయి. ఇక ఇంట్లోనే క్రికెట్ చూస్తున్నాడు రంగ. "ఒరేయ్! చెల్లెలికి పరీక్షలురా! సౌండ్ చిన్నగా పెట్టుకోరా!" అన్నది తల్లి. అయినా మనోడు వింటేనా? గీతాంజలి ఫ్రెండ్ అయిన శ్రుతి ఇంటికి వెళ్ళి చదువుతుంది. రోజులు గడుస్తున్నాయి. 10వ తరగతి పరీక్షా ఫలితాలు వచ్చాయి. రంగ పాస్ అయినాడు కానీ చాలా తక్కువ మార్కులు వచ్చాయి. తల పట్టుకుంది గీతాంజలి. "నేను, నా ఫ్రెండ్ శ్రుతి పందెం కాసుకున్నాము. మా అన్నయ్యకు ఎక్కువ మార్కులు వస్తాయి అంటే కాదు మా అన్నయ్యకే ఎక్కువ మార్కులు వస్తాయి అని. నిన్ను నమ్మడం నా పిచ్చి." అంది గీతాంజలి. మనోడు క్రికెట్ చూస్తూ ఫ్రెండుతో బెట్టింగ్ కాసి డబ్బులు పోగొట్టుకున్నాడు. అన్నా చెల్లెళ్ళకు ఎంతో తేడా. నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి