నిదుర మరచిన కనులతో
ఎదురు చూసి కలలతో
కుదురు లేని మనసుతో
బెదిరిపోయిన ప్రాణానికి.....
జీవంపొసే అమృతం ఉదయం!
అలసిపోయిన అంతరంగంతో
నిలిచిపోయిన అడుగులకు
మరచిపోయిన విజయమేదో
వలచి వచ్చి చేరుకునే ఉదయం!
శిలగ మారిన చిన్ని ఎడదకు
కలగ మారిన ఆనందాలు
వెలి వేసిన సంతోషాలు
చెలిమితో చేర వచ్చే ఉదయం!
చీకటి నీడలో మగ్గే మదికి
లోపలి కలతలు కరిగించి
ఓపని సుఖాల గనినిచ్చి
రేపటిపై ఆశను పెంచే ఉదయం!
మోడుగ మారిన తలపులతో
బీడైపోయిన హృదయానికి
నీడగా నింగి తోడుగా దిక్కులున్నాయని
బెంగను పోగొట్టే ఉదయం!
కోటి మార్పులు చేస్తానంటూ
నేటి విజయం నీదేనంటూ
నీటి మాటలు కానే కావంటూ
బాట చూపి నడిపించే ఉదయానికి
🌸🌸 సుప్రభాతం 🌸🌸
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి