కనకపల్లి" అనే ఒక చిన్న పల్లెటూరిలో కాంతారావు అనే విరమణ పొందిన ఒక ఉపాధ్యాయుడు ఉండేవాడు. అతడు ఎప్పుడు ఇతరుల మేలు కోరుతూ, ఊరిలో పిల్లలకు జ్ఞానోదయం కలిగే పనులను చేస్తూ చూపేవాడు. ఒకరోజు ఒక గ్రామ సింహం కాంతారావు వాళ్ళ ఇంటికి వచ్చింది. అప్పుడు కాంతారావు దానికి కడుపునిండా గట్కా గంజి పెట్టి మెల్లిగా తన దగ్గర ఉండేలా అలవాటు చేసుకున్నాడు. ఆ గ్రామ సింహం అతనితో చాలా మచ్చికగా ఉంటూ అతని వద్దనే ఉంటుంది.
ఒకరోజు" కాంతారావు దానికి నక్క రంగు వేసి ఒక చుక్క బొట్టు పెట్టి గ్రామ వీధుల్లోకి పంపించాడు. అప్పుడు దాన్ని చూసిన పిల్లలంతా కేరింతలు కొడుతూ గ్రామంలోకి నక్క వచ్చిందని ఇరుగుపొరుగు పిల్లలను కూడా పిలిచి దానిని ఆటపట్టించడానికి ప్రయత్నించారు. అప్పుడు ఆ కుక్క ఆ పిల్లల అల్లరి పనులు చూసి . దానిని నిజరూపము ఏమిటో పిల్లలకు తెలియాలని బౌ బౌమని అరుస్తూ ఆ వీధిలో ఉన్న గురువయ్య గుడిసెలోకి దూరింది . గురువయ్య కాంతారావు ఇద్దరు చిన్ననాటి మిత్రులు. వీరి ఇరువురి సమాచారాలు ఒకరికొకరికి తెలుస్తుండేది. పిల్లలందరూ కలిసి గురువయ్య వద్దకు చేరుకున్నారు.మీ గుడిసెలో కి ఒక నక్క దూరింది నీవు చూశావా, అని పిల్లలు అడిగారు . ఆ! చూశాను అది నక్కకాదు, కుక్క దాని అరుపు విని కూడా గుర్తుపట్టలేదు ? ఆ పిల్లలు! మీ మెదడుకు మేత పెట్టాలని కాంతారావు గారు దానికి నక్క వలె రంగు వేసి మీవద్దకు పంపించాడు .అని పిల్లలకు నిజం చెప్పుతూ ఇలా అంటాడు .పిల్లల్లారా ఎప్పుడైనా ఎవరైనా మిమ్మల్ని మోసం చేయాడానికి నక్క రంగు పులుముకున్నా కుక్కవలే వస్తే వారి మోసాన్ని గమనించి తగిన గుణపాఠం చెప్పి పంపించాలి.*
అప్పుడు" నిజం తెలుసుకున్న పిల్లలంతా కాంతారావు వద్దకు వెళ్లి, ప్రతిరోజూ ఎన్నో క్రొత్త,కొత్త విషయాలు తెలుసుకుంటూ ,గొప్ప విజ్ఞానవంతులయ్యారు. కాంతారావు ఎప్పటికి పిల్లలు నేస్తం!!

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి