అవ్వచూపు! అచ్యుతుని రాజ్యశ్రీ
 మహిళల మహితోత్సవ వేడుకలు
హ్యాపీ ఉమెన్స్ డే సంబరాలు
ఆ దిక్కే అవ్వచూపు
కిలకిల ఆడపిల్లలు కిటకిటలాడుతూ ఆంటీలు 
బస్సుకోసం  బారులు బారులు
ఆగింది బస్సు ఎగిరిన సీతాకోకచిలుకలు
ఎక్కలేక వత్తిడికి తట్టుకోలేక  కాలుజారిన అవ్వ తుర్రుమన్న బస్సు
ఆదిక్కే అవ్వచూపు పట్టెడుబువ్వ 
గుక్కెడు నీటికోసం
మైక్ లో పాటలు ఉపన్యాసాలు 
ఆపై ఫ్యాషన్ పెరేడ్లు
ఒంటరి రెక్కలుతెగిన జటాయువులా అవ్వ
ఒళ్లంతా ముడతలు గుంటల కనులు కొబ్బరిపీచు జుట్టు
చెట్ల కింద  సీతాకోకచిలుకలు
ప్లేట్లనిండా ఘుమఘుమలు
గ్లాసులలో కూల్ డ్రింక్స్
మహిళలూ మహారాణులూ అంటూ హోరెత్తే పాటలతో స్టెప్పులు 
గవ్వకళ్లతో అవ్వ జావలా జారె 
కుక్కపిల్ల అవ్వ వీపుకాని కునుకుతీసే 
అవ్వ ప్రాణపక్షి ఎగిరిపోయే 
ముసలితనం క్షోభ ఎరుగని యువత ఆనందంతో తూగుతూ 
సంబరాల అంబరాలలో నేటికాలం

కామెంట్‌లు