శ్రీపురం రాజ్యానికి రాజు విజయుడు. అతని పరిపాలన ప్రజానురంజకంగా సాగేది. అవినీతికి అసలే చోటు లేదు. రాజుగారు ఒకసారి గుడి వద్దకు వెళితే అక్కడ చాలామంది బిచ్చగాళ్ళు కనిపించారు. ఆస్థానానికి వచ్చిన తర్వాత రాజ్యంలో ఎంత మంది బిచ్చగాళ్ళు ఉన్నారో వెతికి అందరినీ తీసుకు రమ్మని ఉద్యోగులను ఆదేశించాడు. వాళ్ళకు తన మూలంగా మంచిరోజులు రానున్నాయని చెప్పాడు.
ఎంతో మంది బిచ్చగాళ్ళు ఆశతో వచ్చారు. అందరినీ ఒకచోట చేర్చి, వారితో రాజు ఇలా అన్నాడు. "అందరికీ కాళ్ళు, చేతులు బాగున్నాయి. కష్టపడి సంపాదించి బతకడం మానవ ధర్మం. సోమరితనంతో అడుక్కు తినడం దొంగతనంతో సమానం. మీ అందరికీ కావలసిన పని నేను కల్పిస్తాను. కష్టపడి సంపాదించి బతకండి. లేదూ ఇంకా సోమరితనంతో అడుక్కు తింటాము అంటే వారికి కఠిన శిక్షలు ఉంటాయి. మరీ బాగా అంగ వైకల్యం గలవారిని ఎలా ఆదుకోవాలో నేను ఆలోచిస్తాను." అని అన్నాడు.
ఆ తరువాత వారి అందరిలో ఎక్కువ మంది రాజ్యం విడిచి వెళ్ళిపోయారు. అతి కొద్దిమంది మాత్రమే కష్టించి పని చేయడానికి ముందుకు వచ్చారు. మనుషుల స్వభావం చూసి రాజుగారు తల పట్టుకున్నారు.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి