స్త్రీ :-నామ వెంకటేశ్వర్లు,తెలుగు భాషా బోధకులు,=-జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల,అయిటిపాముల, నల్లగొండ.
 అమ్మగా జన్మనిచ్చి, లాలించి, బుజ్జగించి, పాలించే . 
అక్క గా అనురాగాన్ని, ఆప్యాయత ను అందించే 
చెల్లిగా చెలిమి చేస్తూ  చేరదీసే 
ఒదినగా ఓదార్చే 
మరదలిగా మర్యాదనిస్తూ 
అత్త గా ఆదరణనిస్తూ
అమ్మమ్మ గా హక్కున చేర్చుకునే 
నానమ్మ గా నజర్ కల్పిస్తూ 
కోడలిగా కలివిడిగా ఉంటూ 
పుట్టింటి బంధాలకు దూరమై 
మెట్టింటి వారితో బంధాన్ని మెరుగు చేసుకుంటూ 
అత్తా మామలతో అణకువగా 
మసలుతూ  
మెట్టింట అందరిచే ఆదరించబడుతూ 
మేనత్త గా మేర్మానం చూపిస్తూ 
స్నేహితురాలిగా క్షేమములడుగుతూ 
 చిన్నమ్మ వై చింతలు తీరుస్తూ 
 కూతురై కుదురుగా ఉంటూ 
=============================
అర్ధాంగిగా.... అన్ని తానై అన్ని పాత్రలు చక్కగ పోషిస్తున్న  మహిళా మూర్తులందరికి..........
 అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు 🌹🌹🌹🌹🌹🌹🙏

కామెంట్‌లు