అరువది వత్సరములు...
వత్సరమునకు పండ్రెండు నెలలు...
నెలకు నాలుగు వారములు...
వారమునకు ఏడు దినములు...
దినమునకు రెండు
పూటలు...
ఇరువది నాలుగు
గంటలు...!
పునః పునః తిరిగి తిరిగి మరల మరల ఇవే ,వచ్చిన వేవస్తూ...పునరావృతమౌతూనే వుంటాయి...!
చైత్ర మాసము, వసంత రుతువు షడ్రుచుల ఉగాది పచ్చడి , పప్పు మామిడి కాయ... పిండివంటలతో విందు భోజనాలు చేస్తాము,కొత్త బట్టలు కట్టుకుని...నూతనసం వత్స రాదిగా పండుగ చేసు కుంటాము...!!
పాతకు వీడ్కోలు , కొత్తకు స్వాగతాలు పలుకుతూ...
పంచా0గ శ్రవనాలు, కవి సమ్మేలనాలు...! ఆనందోత్సాహాలలో మునిగి తేలుతా0..!!
కొత్త రుచులు... కొత్తఆశలు
కొంగ్రొత్త ఆశయాలతో మునుపటి కంటే ఎంతో కొంత అభి వృద్ధినీ
ఆనందాన్నీ పొందాలని.... ఆకాంక్ష...!
వైషమ్యాలు కలుగని, విబేధాలు పొడసూపని,
అతివృష్ఠి ,అనావృష్ఠి...రోగ, రుణ బాధలు లేని ప్రసాంతతను అనుగ్రహించుమా... మా నూత్న తెలుగువత్సరమా
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి