"గౌరవ డాక్టరేట్ కవి గద్వాల సోమన్నకు ప్రదానం"

 పెద్దకడబూర్ మండల పరిధిలోని,జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, కంబదహాళ్ లో గణితోపాధ్యాయుడుగా పని చేస్తున్న ప్రముఖ బాలసాహిత్యవేత్త ,బాలబంధు  గద్వాల సోమన్నను "గౌరవ డాక్టరేట్" వరించింది.అనతి కాల వ్యవధిలో,కేవలం బాలసాహిత్యంలో  68 పుస్తకాలు రచించి,ప్రచురించి,పలు చోట్ల ఆవిష్కరించి అరుదైన ఘనత సాధించిన సోమన్న అవిరళ కృషి గుర్తించి ISO గుర్తింపు పొందిన అతిపెద్ద అంతర్జాతీయ సాహిత్య,సాంస్కృతిక సేవా సంస్థ,గుంటూరు వారు గద్వాల సోమన్న కు "గౌరవ డాక్టరేట్" ఠాగూరు గ్రంథాలయం,విజయవాడలోప్రదానం చేశారు.పద్మభూషణ్ గుఱ్ఱం జాషువా స్మారక కళా పరిషత్ 37వ వార్షికోత్సవం మరియు శ్రీ విశ్వావసు నామ ఉగాది సందర్భంగా ఈ అవార్డు అందజేయడం విశేషం.అనంతరం వీరి విరచిత 66వ పుస్తకం"బడి అమ్మ ఒడి" అంతర్జాతీయ గుఱ్ఱం జాషువా కళా పరిషత్  చైర్మన్ డా.పెద్దీటి యోహాను మరియు కార్యక్రమానికి విచ్చేసిన ప్రముఖుల చేతుల మీద ఆవిష్కరించారు. అదీకాక వీరి పుస్తకం "హృదయ రాగాలు"కు మహాకవి గుఱ్ఱం జాషువా జాతీయ పురస్కారం లభించింది.అవార్డు గ్రహీత, బహుముఖ ప్రజ్ఞాశాలి గద్వాల సోమన్న ను సాహితీమిత్రులు, శ్రేయోభిలాషులు,తోటి ఉపాధ్యాయులు అభినందించారు.
కామెంట్‌లు