సుప్రభాత కవిత : - బృంద
కష్టపడే తరుణులకు 
ఇష్టమైన పనులుంటే 
కాలమంతా ఉత్సాహమే!

కలలు కనే ముదితకు 
నిజం చేసుకునే క్రమంలో 
నిరంతరం పరీక్షలే!

అలుపుకు గెలుపివ్వని 
అంతరంగమున్న అమ్మాయికి 
అడుగడుగునా ఆనందాలే!

ధ్యేయమంటూ ఉన్న సుదతికి 
ధైర్యం దైవం.
రెండూ నేస్తాలే!

ధర్మం తెలిసిన నెలత 
మర్మమెరిగి  నడచుకుంటే 
బంధాలన్నీ సొంతాలే!

మాటమీరక మనసులందు 
చోటు గెలిచే మానినికి 
మనుగడ నల్లేరు మీది నడకలే!

తాను ఎదిగి పదుగురికి 
బ్రతుకునిచ్చు పడతికి 
విజయాలు కొంగున బంగారాలే!

ఎంత ఎదిగినా కొంత 
ఒదిగి ఉండు ఎలనాగ
ఎల్ల వేళలా పొందు మెప్పులే!

నియంత్రణ నిర్వహణ 
సహకారం  సహనం 
తెలివైన మహిళలకు నగలే!

సకల నైపుణ్యము సంపాదించి 
జగతి నేలు దిశ వైపు సాగిపోవు 
వనితలకివే వేవేల జోతలు 🙏

🌸🌸 సుప్రభాతం 🌸🌸

 

కామెంట్‌లు