కోల్కత్తాలోని ఇండియన్ బొటానికల్ గార్డెన్ లో ఒక భారీ మర్రి వృక్షం ఉంది. ఈ వృక్షం మొదలు ఏదో కనిపెట్టడం కష్టసాధ్యమే! ఎందువల్ల అంటే దీనికి దాదాపు 2800 ఊడలు చెట్టు మొదలవలె ఉన్నాయి. మన దేశపు ఉత్తరాది ప్రాంతాల్లో వ్యాపారులను"బనియా"అంటారు. అక్కడ వ్యాపారం మర్రి చెట్టు కింద ఎక్కువగా జరిగేవి. కావున మర్రిచెత్తను ఇంగ్లీషులో బాన్యన్ ట్రీ అని బ్రిటిష్ వారు పిలిచేవారు. దీనిని పైకస్ బెంగా లెన్సిస్ అని అంటారు. 26 మార్చి, 2000 నాటికి దీని ఊడలు 17 75. గా ఉండేవి.
ప్రస్తుతం అవి 2 800 పైగా ఉన్నవి. ఇది ప్రపంచంలో అతిపెద్ద వైశాల్యం గల వృక్షంగా పేరొందింది. ఇది దాదాపు 200 సంవత్సరాల క్రితం నాటింది.
మరో విశేషం ఏమిటంటే ఈ మర్రి చెట్టు రావి చెట్టుతో కలిసి ఉన్నది.
మహా మర్రి వృక్షం: -తాటి కోల పద్మావతి
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి